విదేశాల్లో భీమ్లా నాయక్ దుమ్ము దుమారం.. పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డు
సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చాక రికార్డుల సునామీ సృష్టిస్తున్నారు. వకీల్ సాబ్ రూపంలో పలు రికార్డులు తిరగరాసిన పవర్ స్టార్ ఈ సారి అంటూ బాక్సాఫీస్ దాడికి దిగారు. ఫిబ్రవరి 25వ తేదీన విడుదలైన 'భీమ్లా నాయక్' మూవీ దేశ విదేశాల్లో భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. పవన్ కళ్యాణ్ పవర్ స్ట్రోమ్‌కి బాగా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. రెండు తెలుగు రాష్ట్రాల సంగతి అటుంచితే ఓవర్‌సీస్‌లో భీమ్లా దుమారం కనిపిస్తోంది. తాజాగా అక్కడ సరికొత్త రికార్డు నమోదు చేశారు పవన్. ప్రస్తుతం యూఎస్‌లో భీమ్లా నాయక్ హవా నడుస్తోంది. అక్కడ 250కి పైగా థియేటర్లలో రోజుకు 750 షోలు ప్రదర్శించబడుతున్నాయి. ఇప్పటివరకు 2.25 మిలియన్ డాలర్స్ వసూలు చేశాడు భీమ్లా. దీంతో అంతకుముందు పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' పేరిట ఉన్న రికార్డ్ తుడిచిపెట్టుకుపోయింది. అంతేకాదు యూఎస్‌లో ఆల్ టైమ్ తెలుగు హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన చిత్రాల వరుసలో 15వ స్థానంలో నిలిచాడు భీమ్లా నాయక్. ప్రీమియర్ షోస్ ద్వారానే 875,292 డాలర్స్ రాబట్టిన భీమ్లా నాయక్ అదే హంగామా కంటిన్యూ చేస్తూ తొలి రోజుకు గాను 451,368 డాలర్స్, రెండు రోజుకు గాను 471,128 డాలర్స్, మూడో రోజుకు గాను 223,195 డాలర్స్, నాలుగో రోజుకు గాను 39,152 డాలర్స్, ఐదో రోజుకు గాను 198,832 డాలర్స్ రాబట్టాడు. మొత్తంగా చూస్తే 2.25 మిలియన్ డాలర్స్ అనగా 17.13 కోట్లు వసూలయ్యాయి. అక్కడ భీమ్లా జోష్ చూస్తుంటే అలవోకగా 2.50 మిలియన్ డాలర్స్ చేరి మరిన్ని వసూళ్లు రాబడతాడని స్పష్టమవుతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా.. నిత్యామీనన్, సంయుక్తా మీనన్ హీరోయిన్లుగా నటించారు.
By March 03, 2022 at 10:34AM
No comments