Breaking News

రాధే శ్యామ్ సినిమాలో హైలైట్ సీన్.. ఈలలు, గోలలతో హోరెత్తుతున్న థియేటర్స్


ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానే వచ్చింది. థియేటర్స్‌లో మేనియా నడుస్తోంది. నేడే (మార్చి 11) ప్రపంచ వ్యాప్తంగా రాధే శ్యామ్ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ప్రభాస్ ఖాతాలో మరో హిట్ పడినట్లే అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని ఏరియాల్లోని థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా కనిపిస్తోంది. ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందంటూ గొప్పగా చెబుతున్నారు. ట్విట్టర్‌లో పాజిటివ్ వైబ్రేషన్స్ నెలకొన్నాయి. కొంతమంది నెటిజన్లు రాధే శ్యామ్ క్లిప్స్ పోస్ట్ చేస్తూ ఈ మూవీపై తమ తమ అభిప్రాయలు తెలుపుతున్నారు. చిత్రంలో ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందంటూ ఓ నెటిజన్ సదరు క్లిపింగ్ పోస్ట్ చేయడంతో ఆ వీడియో వైరల్ అవుతోంది. అభిమానుల ఈలలు, గోలలతో థియేటర్స్‌ హోరెత్తిపోతున్నాయి. ప్రెజెంట్ సిచుయేషన్, ఆడియన్స్ టాక్ చూస్తుంటే ఈ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టొరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కృష్ణం రాజు స‌మ‌ర్ప‌ణ‌లో యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మాతలుగా అత్యంత గ్రాండ్‌గా రూపొందించారు. చిత్రంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ముఖ్యపాత్రలో కనిపించడం విశేషం. సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దాదాపు 202 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. అందుకు తగ్గట్లుగానే థియేటర్ల వద్ద రాధే శ్యామ్ మేనియా కనిపిస్తోంది.


By March 11, 2022 at 09:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/radhe-shyam-interval-clip-viral-on-social-media/articleshow/90140290.cms

No comments