రాధే శ్యామ్ ఫస్ట్ రివ్యూ: సినిమా మొత్తంలో అదే ప్రత్యేకం.. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ఉందంటే..!
దుబాయ్ సెన్సార్ సభ్యుడు, ప్రముఖ సినీ క్రిటిక్ ఉమైర్ సంధు రాధే శ్యామ్ సినిమాపై ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. నటనపై ప్రశంసలు గుప్పిస్తూ సినిమా ఎలా ఉందనే విషయాన్ని, తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అసలు సిసలైన సినిమా అంటే రాధేశ్యామ్ అని తెలుపుతూ ఈ సినిమాలో క్లైమాక్స్ అద్భుతంగా వచ్చిందని, సినిమాకు అదే ప్రత్యేకం అని చెప్పారు. గత్తంలో ఎన్నడూ చూడని యూనిక్ సబ్జెక్టుతో ఈ సినిమా రూపొందించారని చెప్పిన ఉమైర్ సంధు.. చిత్రంలో డార్లింగ్ ప్రభాస్- పూజ హెగ్డే కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయిందని అన్నారు. ఇకపోతే ఈ చిత్రంలో VFX వర్క్స్ అమోఘమని తెలిపారు. క్లాస్, స్టైల్‌లో ప్రభాస్‌ను కొట్టే మొనగాడు ఇండియాలో లేడని ఉమైర్ సంధు పేర్కొనడం రెబల్ స్టార్ అభిమానులను మరింత హుషారెత్తించింది. ప్రస్తుతం ఉమైర్ సంధు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో 5 రోజుల్లోనే రాధే శ్యామ్ గ్రాండ్ రిలీజ్ ఉన్న నేపథ్యంలో నెట్టింట ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన డిస్కషన్సే జరుగుతున్నాయి. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టొరీగా మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. కృష్ణం రాజు సమర్పణలో యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్, ప్రశీద నిర్మాతలుగా అత్యంత గ్రాండ్‌గా రూపొందించారు. చిత్రంలో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ముఖ్యపాత్రలో కనిపించనుండటం విశేషం. సచిన్ ఖేడ్కర్, మురళీ శర్మ, భాగ్యశ్రీ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, ఫ్లోరా జాకబ్ ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పించింది. వెండితెరపై ప్రభాస్‌ని చాలా కాలం కావడంతో రెబల్ స్టార్ అభిమానుల్లో ఈ మూవీ పట్ల ఆతృత పెరిగింది. భారీ అంచనాల నడుమ ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కాబోతోంది.
By March 07, 2022 at 07:04AM
No comments