ఆయన మాటల్లో వెటకారం..! కృష్ణం రాజు క్యారెక్టర్‌పై ప్రభాస్ కామెంట్స్
ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణాలు దగ్గర పడ్డాయి. యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా సినిమా '' ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన ప్రభాస్.. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజాగా జరిగిన ఓ మీడియా సమావేశంలో తన పెద నాన్న రోల్, సినిమాలో ఆయన క్యారెక్టర్ విషయమై రియాక్ట్ అయ్యారు ప్రభాస్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్‌తో కూడా తెరపంచుకోబోతున్న సంగతి తెలిసిందే. మహాజ్ఞాని పరమహంస పాత్రలో కృష్ణం రాజు కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఆయన లుక్స్ విశేష స్పందన పొందాయి. అయితే ఈ క్యారెక్టర్ విషయమై రియాక్ట్ అయిన ప్రభాస్.. అన్నీ తెలిసిన బుద్ధుడు తరహాలో ఆయన రోల్ ఉంటుందని, అలాగే ఆయన మాటల్లో వెటకారం ఉంటుందని చెప్పారు. ఈ రోల్‌ని డైరెక్టర్ రాధాకృష్ణ చాలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారని తెలిపారు. పెదనాన్నతో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుండటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇకపోతే షూటింగ్ సమయంలో కృష్ణం రాజు గారు అందరితో ఎంతో సరదాగా ఉండేవారని, డైరెక్టర్ తోనూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడేవారని ప్రభాస్ అన్నారు. సెట్స్‌లో ఆయన ఎనర్జీ చూసి అంతా ఆశ్చర్యపోయేవారమని తెలిపారు. కృష్ణం రాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్ జంటగా పూజ హెగ్డే నటించింది. హస్తసాముద్రిక నిపుణుడు విక్రమాదిత్య పాత్రలో ప్రభాస్ నటించగా, ఆయన ప్రేయసి ప్రేరణ రోల్ పూజా పోషించింది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.
By March 08, 2022 at 08:08AM
No comments