తండ్రి ఆత్మహత్యాయత్నం.. అమెరికా నుంచి ముంబయి పోలీసులకు మహిళ ఫోన్
ఆత్మహత్యాయత్నం చేసిన ఓ 74 ఏళ్ల వ్యక్తిని పోలీసులు రక్షించారు. అమెరికాలో ఉండే ఆ వ్యక్తి కుమార్తె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సకాలంలో చేరుకుని, అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న అతడికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పోలీస్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసిన ఓ మహిళ.. మాతుంగా ఈస్ట్‌లో ఉండే తన తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడని తెలిపింది. తాను ప్రస్తుతం టెక్సాస్‌లో ఉంటున్నానని, ఆయనను రక్షించాలని కోరింది. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు.. అపస్మార స్థితిలో ఉన్న అతడిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ‘‘ఆత్మహత్యాయత్నానికి ముందు తన కుమార్తెకు సమాచారం ఇచ్చిన అతడు.. సూసైడ్ నోట్ రాసిపెట్టి, ఆస్తికి సంబంధించిన వీలునామా కూడా చేసినట్టు తెలిపాడు’’ అని పోలీసులు పేర్కొన్నారు. ‘‘అమెరికాలోని ఉండే అతడి కుమార్తె పోలీసులను అప్రమత్తం చేయడంతో మాతుంగ పోలీస్ స్టేషన్ సిబ్బంది అతడి ఫ్లాట్‌కు చేరుకున్నారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.. ప్రస్తుతం అతడికి ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది.. పరిస్థితి విషమంగానే ఉంది’’ అని తెలిపారు. అతడు ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
By March 08, 2022 at 08:49AM
No comments