20 రోజులకు పవన్ రెమ్యునరేషన్ వింటే ఖంగు తినడం ఖాయం!
రీసెంట్‌గా విడుదలైన ‘భీమ్లా నాయక్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఇప్పుడు తదుపరి చిత్రం ‘హరి హర వీర మల్లు’సినిమాపై ఫోకస్ పెట్టారు. పీరియాడిక్ మూవీగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలనేది పవన్ ఆలోచనగా కనిపిస్తుంది. దీంతో పాటు పవన్ మరో రీమేక్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పేశారనేది టాలీవుడ్‌లో బలంగా వినిపిస్తోన్న వార్త. తమిళ చిత్రం ‘వినోదయ సిత్తం’ అనే తమిళ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయబోతున్నారట. అందులో పవన్ కీలక పాత్రలో నటిస్తారని.. దాని కోసం ఆయన 20 రోజులను మాత్రమే కేటాయించారనేది టాక్. తమిళంలో సముద్ర ఖని దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో సముద్ర ఖని డైరెక్ట్ చేస్తారట. అయితే ఆయన నటించిన పాత్రను మాత్రం పవన్ కళ్యాణ్ చేస్తారని సమాచారం. దీని కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల సమయాన్నే కేటాయించారు. అందులో ఆయన తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ లేదా వైష్ణవ్ తేజ్‌తో కలిసి నటిస్తాడనేది కూడా సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న తాజా కబర్. కాగా.. పవన్ తను కేటాయించిన 20 రోజుల కోసం భారీ రెమ్యునరేషన్‌నే అందుకోబోతున్నారట. ఇండస్ట్రీలో వినిపిస్తోన్న గుసగుసల ప్రకారం ఈ 20 రోజులకుగానూ పవన్ ఏకంగా 50 కోట్ల రూపాయలను రెమ్యునరేషన్‌గా తీసుకోబోతున్నారట. అంటే రోజుకు రెండున్నర కోట్లు. పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్‌ను బేస్ చేసుకుని నిర్మాతలు ఆ రేంజ్‌లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారట. ఇప్పుడు సముద్ర ఖని, త్రివిక్రమ్ వినోదయ సిత్తం సినిమాను తెలుగు నెటివిటీకి తగిట్లు మార్పులు చేర్పులు చేయడంలో బిజీగా ఉన్నారట. వీలైనంత త్వరగానే సినిమాను స్టార్ట్ చేసి పూర్తి చేయాలనేది దర్శక నిర్మాతల ప్లాన్.
By March 05, 2022 at 08:53AM
No comments