Breaking News

సలార్‌ సీక్రెట్ రివీల్ చేసిన ప్రభాస్.. వెరీ ఇంట్రెస్టింగ్!!


ప్రస్తుతం 'రాధే శ్యామ్' సినిమా ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు రెబల్ స్టార్ . మార్చి 11వ తేదీన ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ ఉండటంతో పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ తన కెరీర్ సంగతులపై ఓపెన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'సలార్' గురించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటపెట్టారు ప్రభాస్. పాన్ ఇండియా దర్శకుడు, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ రేంజ్‌లో సలార్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. యక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై రెండు భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మేకింగ్ కోసం భారీ బడ్జెట్‌ కేటాయించిన టీమ్ ఎక్కడా తగ్గేదేలే అంటోందట. అయితే ఈ భారీ సినిమాలో మలయాళ స్టార్ కూడా భాగం కాబోతున్నట్లు ప్రభాస్ స్వయంగా వెల్లడించారు. ఇందులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉండనుందని అన్నారు. ఇకపోతే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ మునుపెన్నడూ చూడనంత హైలైట్‌గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుండటం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. సినిమాలో యాక్షన్‌కి తోడు గ్లామర్ కూడా ఉండేలా జాగ్రత్త పడుతున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. శ్రద్ద కపూర్‌తో ఓ స్పెషల్ సాంగ్ చేయిస్తున్నారట. ఇక ఈ మూవీపై రెబల్ స్టార్ ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు మాటల్లో చెప్పలేం.


By March 09, 2022 at 11:05AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/prabhas-revealed-salaar-secret-in-latest-interview/articleshow/90093642.cms

No comments