నెట్టింట మంటపెట్టిన సమంత.. ప్రీతమ్‌కి ట్యాగ్ చేస్తూ చాలా ఇష్టం అనేయడంతో!
స్టార్ హీరోయిన్ సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని ఫొటోస్ ప్రస్తుతం ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి. విడాకుల తర్వాత తొలిసారి అందాల తలపులు తెరిచి స్టైలిష్ ఫోటో షూట్‌లో పాల్గొంది సామ్. సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటున్న ఆమె ఆ ఫొటోలను స్వయంగా షేర్ చేయడంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్న ఈ ఫోటోలు చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. ఈ ఫోటో షూట్‌లో గతంలో ఎన్నడూలేని విధంగా గ్లామర్ డోస్ హైలైట్ చేసింది సమంత. రీసెంట్‌గా ఓ అవార్డ్స్ ఫంక్షన్‌కి వెళ్లిన సమంత.. ఈ ఫోటో షూట్‌లో పాల్గొందట. తన స్టైలిస్ట్ ఎంతో స్టైలిష్‌గా రెడీ చేశారని తెలుపుతూ ఆయనకు ఈ ఫొటోస్ ట్యాగ్ చేసింది సమంత. ఇవి తన ఫేవరైట్ లుక్స్ అంటూ ఆమె పెట్టిన కామెంట్స్ జనాల్లో హాట్ ఇష్యూగా మారాయి. సమంత షేర్ చేసిన ఈ ఫొటోస్ చూస్తే నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఫోకస్ మొత్తం సినిమాలపైనే పెట్టిందని, హీరోయిన్లకు గట్టి పోటీనిచ్చేలా సామ్ అడుగులు పడుతున్నాయని స్పష్టమవుతోంది. సమంత, ఆమె స్టైలిస్ట్ ప్రీతమ్ జూకాల్కర్ ఎంత క్లోజ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమంత చేసే పనుల్లో ప్రీతమ్‌ల హ్యాండ్ ఎంతో కొంత అయినా ఉంటుంది. వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ కొన్ని పుకార్లు కూడా పుట్టించింది. సమంత- ప్రీతమ్ రిలేషన్‌పై అప్పట్లో పలు రకాలుగా చెప్పుకున్నారు జనం. ఇకపోతే నాగ చైతన్యతో విడాకుల తర్వాత కెరీర్ పైనే పూర్తి ఫోకస్ పెట్టింది సమంత. కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసినట్లుగా ఫీల్ అవుతూ తనకు నచ్చినట్లుగా ఉంటోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా డిఫరెంట్ కంటెంట్ సినిమాలను ఓకే చేస్తోంది. ఆమె నటించిన 'శాకుంతలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం 'యశోద'తో పాటు మరో తమిళ సినిమాతో బిజీగా ఉంది సామ్.
By March 11, 2022 at 11:27AM
No comments