పూజా నోట సె** మాట! అడ్డంగా బుక్కైన స్టార్ హీరోయిన్
కొన్ని సందర్భాల్లో హడావిడిలో అనుకోకుండా మాట్లాడే మాటలు లేనిపోని తంటాలు తెచ్చిపెడతుంటాయి. ఏదో చెప్పాలన్న తొందరలో కొన్నిసార్లు మాట్లల్లో తప్పులు దొర్లుతుండటం సహజమే అయినా సెలబ్రిటీల విషయంలో మాత్రం ఈ తప్పులే ట్రోలింగ్‌కి గురి చేస్తుంటాయి. తాజాగా స్టార్ హీరోయిన్ విషయంలో అదే జరిగింది. దీంతో నెటిజన్లు ఆమెపై తెగ ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే రీసెంట్‌గా ప్రభాస్‌తో సినిమా కంప్లీట్ చేసింది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను మార్చి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టిన టీమ్.. పలు ఇంటర్వూస్ ఇస్తూ రాధే శ్యామ్ షూటింగ్ సంగతులు, సినిమా విశేషాలు పంచుకుంటున్నారు. అయితే తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పూజా నోట ఓ అసభ్యకరమైన మాట రావడంతో దానిపై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. ఇది పెద్ద విషయం కాదు పైగా ఆమె కావాలని ఆ పదం అనలేదు కానీ అనుకోకుండా ఆమె నోటి వెంటదొర్లిన ఒక చిన్న తప్పు జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఓ ఛానల్ కోసం ఎక్స్‌క్లూజివ్‌గా చేస్తున్న ఇంటర్వ్యూలో పూజా హెగ్డే మాట్లాడుతూ సక్సెస్ అనే పదం వాడేందుకు బదులు సె** అనే మాట అనేసింది. కానీ ఆ వెంటనే తన తప్పు సరిద్దుకుంది పూజా హెగ్డే. ఇదే నెటిజన్లకు ట్రోలింగ్ పాయింట్ అయింది. ప్రస్తుతం హీరోలకు బెటర్ ఛాయిస్ అవుతున్న పూజా హెగ్డే.. తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషా చిత్రాలతో బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అభిమానులకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఆమె లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ కోసమా యావత్ సినీ లోకం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
By March 07, 2022 at 10:23AM
No comments