BFI IMAX : బ్రిటన్‌లో తొలి భారతీయ చిత్రం RRR రికార్డ్.. వేట మొదలైంది
సినిమాను ప్రేమించే ప్రతీ భారతీయుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం RRR. బాహుబలితో తెలుగు సినిమా రేంజ్ ఏంటో ప్రపంచానికి చాటిన దర్శకుడు. ఆయన దర్శకత్వంలో వస్తున్న తదుపరి చిత్రం కావడం ఒకటైతే.. టాలీవుడ్ అగ్ర హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కథానాయకులుగా నటిస్తున్నారు. మార్చి 25న సినిమా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పాటు ఐదారు అనువాద భాషల్లోనూ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతుంది. RRR విడుదలకు ముందే సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందోనని అందరిలోనూ తెలియని ఓ ఉత్కంఠత నెలకొంది. సినిమాను భారీ రేంజ్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు జక్కన్న అండ్ టీమ్. ఇటు ఇండియా.. అటు విదేశాల్లోనూ ఎవరూ ఊహించనన్ని థియేటర్స్‌లో RRR రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకోనుంది. అదేంటంటే.. లండన్‌లో అతి పెద్ద స్క్రీన్ అయిన బీఎఫ్ఐ ఐమ్యాక్స్‌లో ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ తెరపై ప్రదర్శితం కానున్న తొలి తెలుగు చిత్రమిదే. యు.కెలో 1000 స్క్రీన్స్‌కు పైగా RRR రిలీజ్ కానుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక రిలీజ్‌కు ముందు.. రిలీజ్ తర్వాత మరెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఫ్యాన్స్, సినీ గోయర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1920 బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఫిక్షనల్ పీరియాడిక్ మూవీ RRR. ఇందులో గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించారు. ఇక కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్, ఆలియా భట్.. హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్, రే స్టీవెన్ సన్, అలిసన్ డూడి నటించారు. చరిత్రలో ఎన్నడూ కలుసుకోని ఇద్దరు యోధులు కలుసుకుని బ్రిటీష్ వారిని స్వాతంత్య్రం కోసం ఎదిరిస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ పాయింట్‌తో సినిమాను జక్కన్న తెరకెక్కించారు.
By March 03, 2022 at 11:29AM
No comments