Aadavallu Meeku Joharlu Twitter Review: కొత్తగా ఏముంది? ఆడియన్స్ రిపోర్ట్
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. గత కొంతకాలంగా హిట్స్ లేక డీలా పడిన ఈ హీరో ఇప్పుడు '' అంటూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీతో బరిలోకి దిగారు. చిత్రంలో శర్వానంద్ జోడీగా క్రేజీ బ్యూటీ రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. ఈ రోజే (మార్చి 4) ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రీమియర్స్, స్పెషల్ షోస్ చూసిన ఆడియన్స్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు. మరి వారి రిపోర్ట్ ఎలా ఉందో చూద్దామా.. ఫ్యామిలీ అంతా కూర్చొని ఫన్ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా రూపొందించామని ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ చెప్పింది. అందుకు తగ్గట్టుగానే చిత్ర అప్‌డేట్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అలాగే ఈ మూవీలో సీనియర్ హీరోయిన్లు కుస్భూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశి భాగం కావడం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. అయితే ఈ 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' సినిమా చూసిన ఆడియన్స్ మిశ్రమంగా స్పందిస్తూ ట్వీట్లు పెడుతున్నారు. ఇది ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని కొందరు చెబుతుండగా.. సినిమా కాస్త బోర్ ఫీలింగ్ తెప్పించిందని ఇంకొందరు అంటున్నారు. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా చూశామని అనేవారు కూడా ఉన్నారు. ఓవరాల్‌గా ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ అంతా కామెడీతో సరదాగా సాగిపోతుందట. ఇంటర్వెల్ బ్యాంగ్ బాగా నవ్వించిందట. సెకెండాఫ్ యావరేజ్‌గా ఉందని చెబుతున్నారు. కామెడీతో పాటు కొన్ని ఎమోషన్స్ కూడా యాడ్ చేసి చూపించారట. క్లైమాక్స్‌లో డైరెక్టర్ కిశోర్ తిరుమల మార్కు కనిపించిందని అంటున్నారు. ఈ సినిమాలో నవ్వులు తప్ప కొత్తగా ఏమీ లేదని, ఇది యావరేజ్ మూవీ అని పేర్కొంటున్నారు. శర్వానంద్, రష్మిక మందన కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయిందట. దేవీ శ్రీ బాణీలు ఫర్వాలేదనిపించాయట. మొత్తంగా ఈ సినిమా ఎలా ఉంది? జనాలు కనెక్ట్ అవుతారా? అనేది మరికొద్ది సేపట్లో వచ్చే సమయం పూర్తి రివ్యూతో తెలుసుకోండి.
By March 04, 2022 at 08:11AM
No comments