Breaking News

Aadavallu Meeku Joharlu Pre Release Business : శ‌ర్వానంద్ ముందు పెద్ద టార్గెట్టే ఉంది..హిట్ కంటే అదే కీలకం!


టాలీవుడ్ యంగ్ హీరోలలో కూడా తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్‌ను సంపాదించుకున్నారు. శతమానం భవతి సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న శర్వా మళ్ళీ ఇప్పటి వరకు ఆ రేంజ్ హిట్ దక్కించుకోలోకపోయారు. కమర్షియల్ సినిమాలు చేసి సక్సెస్ కావాలనుకున్న తన ప్లాన్స్ అన్ని గట్టిగానే దెబ్బకొట్టాయి. పడి పడి లేచెమనసు, రణరంగం, జాను, శ్రీకారం సినిమాలు చేశారు. ఈ సినిమాలన్ని వరుసగా ఫ్లాప్స్ కావడంతో శర్వా రేస్‌లో వెనకబడ్డాడు. తమిళంలో హిట్‌గా నిలిచిన 96 సినిమా రీమేక్ జానులో సమంతతో కలిసి నటించగా..ఈ సినిమా పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతక ముందు చేసిన మాస్ ఎంటర్‌టైనర్స్ కూడా శర్వాను నిరాశపరచాయి. దాంతో మళ్ళీ ఫ్యామిలీ కథాంశం చేసి హిట్ కొట్టాలనుకున్నారు. అందుకే శ్రీకారం అంటూ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాను చేశారు. బావుందనే టాక్ తప్ప శర్వానంద్‌కు కమర్షియల్ హిట్‌ను మాత్రం ఇవ్వలేకపోయింది. ఇక మల్టీస్టారర్ మూవీతో హిట్ కొట్టాలనుకుంటే అది ఈ యంగ్ హీరోను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో సిద్దార్థ్‌తో కలిసి మహా సముద్రం సినిమా చేశారు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య వచ్చి ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. ఇలాంటి సమయంలో క్లీన్ ఫ్యామిలీ సినిమా చేసి హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. కిషోర్ తిరుమల దీనికి దర్శకత్వం వహించారు. పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారిన ఇందులో శర్వా సరసన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాతో శర్వా ముందు పెద్ద టార్గెట్టే ఉంది. మార్చి 4న థియేటర్స్‌లో వస్తున్న ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాతో దాదాపు రూ.17 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉందట. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 16 కోట్లు వరకు జరిగిందట. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కావాలంటే రూ.16.5 కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. అది కూడా కేవలం ఒక్క వారం రోజుల్లోనే. నెక్స్ట్ వీక్ ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ రిలీజ్ అవుతోంది. గత నెలాఖరులో వచ్చిన పవన్ - రానాల భీమ్లా నాయక్ ఇంకా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శర్వా తన లేటెస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లుతో హిట్ టాక్ తెచ్చుకోవడం.. బ్రేకీవెన్ టార్గెట్ రీచ్ అవడం అంటే పెద్ద సవాల్ అంటున్నారు.


By March 04, 2022 at 06:13AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/aadavallu-meeku-joharlu-pre-release-business-and-break-even-details/articleshow/89981043.cms

No comments