భారీగా తగ్గిన కోవిడ్ కేసులు.. కొత్తగా 5,476 మందికి కరోనా
దేశంలో భారీగా తగ్గిపోయాయ్. కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా తగ్గింది. గడచిన 24 గంటల్లో కొత్తగా కేవలం 5,476 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,29,62,953కి చేరుకుంది. కరోనా నుంచి 9 వేల 754 మంది కోలుకున్నారు. వైరస్ బారిన పడి 158 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 59,442గా ఉంది. మరోవైపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. శనివారం మరో 26,19,778 డోసులు పంపిణీ జరిగింది. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,78,83,79,249కు చేరుకుంది. దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో మరో పిడుగు లాంటి వార్త వెలువడింది. ఈ ఏడాది జూన్, జూలైల్లో కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందని ఐఐటీ కాన్పూర్ అధ్యయనం తేల్చింది. ఇటువంటి అధ్యయనాలను పరిశీలనలో తీసుకుంటామని ప్రభుత్వం గురువారం తెలిపింది. అయితే ఈ నిర్దిష్ట నివేదికకు శాస్త్రీయ విలువ ఉందా లేదా అనేది ఇంకా పరిశీలించాల్సి ఉంది. నిపుణులు మాత్రం ఇదంతా ఊహగానమే అన్నట్టు కొట్టిపారేస్తున్నారు. ఇది సైన్స్ కాదని అభిప్రాయపడుతున్నారు. కొన్ని నెలల తర్వాత జరగబోయేది ముందే చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇతర దేశాల్లో కూడా కరోనా కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. మలేషియాలో కొత్తగా 33,406 కరోనా కేసులు వెలుగు చూశాయి. అక్కడ వైరస్ బారిన పడిన 67 మంది చనిపోయారు. ఇక చైనాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 175 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇక జర్మనీ, రష్యా, అమెరికా దేశాల్లోనూ వైరస్ వ్యాప్తి సాగుతూనే ఉంది. ఆయా దేశాల్లో కూడా కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేయడమే కాకుండా బూస్టర్ డోసులను అందజేస్తున్నారు.
By March 06, 2022 at 10:19AM
No comments