నో ఫ్లై జోన్ విధిస్తే ఊరుకునేదే లేదు.. పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్
కోసం ఓ పక్క అధ్యక్షుడు జెలెన్ స్కీ పట్టుబడుతుండగా నాటో మాత్రం తిరస్కరిస్తూనే ఉంది. మరోవైపు ఈ విషయంలో వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే రష్యాపై ఆంక్షలు పెట్టడంపై మండిపడుతున్న ఆయన నాటో, ప్రాశ్చాత్య దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో ఏ దేశమైనా నో ఫ్లై జోన్ విధించినా, అలా పెట్టాలని కోరినా ఆ దేశం కూడా యుద్ధంలో భాగమైనట్టేనని పుతిన్ అన్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. నో ఫ్లై జోన్ ప్రకటించే దేశాలు రష్యాతో ఘర్షణకు సిద్ధపడాలని పుతిన్ చెప్పారు. "నో ఫ్లై జోన్ విధించిన ఏ దేశమైనా వివాదంలోకి వచ్చినట్టే భావిస్తాం. ఆ దేశాలు యుద్ధంలో పాల్గొంటున్నట్టుగా పరిగణిస్తాం.. వారు ఏ సంస్థకు చెందినవారు అనేది పట్టించుకోం" అని పుతిన్ అన్నారు. ఇప్పటికే రష్యాపై పెట్టిన ఆంక్షల విషయంలో కూడా ఆయన స్పందించారు. ఆంక్షలు పెట్టడం యుద్ధ ప్రకటనలతో సమానమని పుతిన్ అన్నారు. అలాగే ఉక్రెయిన్ దేశ ఉనికికే భంగం కలిగితే ఆ బాధ్యత ఆ దేశానిదేనని పుతిన్ చెప్పారు. మరోవైపు నో ఫ్లై జోన్ కోసం జెలెన్ స్కీ పదే పదే నాటో దేశాలను కోరుతున్నారు. అయితే ఆ అభ్యర్థనను నాటో తిరస్కరిస్తూ వస్తుంది. దీంతో జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఉక్రెయిన్‌పై మరిన్ని బాంబు దాడులు చేయడానికి రష్యాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనని జెలెన్ స్కీ విమర్శించారు. పైగా ఇకపై రష్యా దాడుల్లో చనిపోయే ఉక్రెయిన్ పౌరులందరి మరణాలకు నాటో దేశాలదే బాధ్యత అని కూడా ఆరోపించారు. కాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడులు 11 రోజుకు చేరుకున్నాయి. కీవ్, ఖర్కివ్, సుమీ నగరాల్లో బాంబుల దాడులు కొనసాగుతున్నాయి. అయితే రష్యా బలగాలతో ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా పోరాడుతున్నారు. వారిని నిలవరించడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే ఇరు దేశాల సైనికులతో పాటు ఉక్రెయిన్ పౌరులు, చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
By March 06, 2022 at 09:46AM
No comments