Breaking News

గొడౌన్‌లో అగ్ని ప్రమాదం.. 12 గంటలుగా ఆగని మంటలు


పశ్చిమ బెంగాల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. కోల్‌కతాలోని మెహర్ అలీ లేన్‌లోని టాంగ్రా ఏరియాలో ఉన్న ఒక గొడౌన్‌లో అంటుకున్నాయి. ఈ మంటలను అదుపు చేయడానికి 12 గంటలుగా శ్రమిస్తున్నారు. అయినా ఈ మంటలు అదుపులోకి రావడం లేదు. శనివారం సాయంత్రం మంటలు అంటుకున్నాయి. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. గొడౌన్‌లో మంటలు ఆర్పేందుకు 15 ఫైరింజన్లు ఉపయోగిస్తున్నారు. దీంతో గోడౌన్‌లో కొన్ని ప్రాంతాల్లో మంటలు పూర్తిగా అదుపు చేశారు. ఇంకా కొన్ని చోట్ల అగ్నిని అదుపు చేయాల్సి ఉంది. గొడౌన్‌లో మండే పదార్థాలు ఉండడం వల్లే.. అగ్ని జ్వాలలు ఎగసిపడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. పైగా మంటలు ఆర్పే క్రమంలో ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. "గొడౌన్‌లో అత్యంత మండే పదార్థాలు ఉన్నాయి. లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో 10 గంటలు దాటినా మంటలు పూర్తిగా ఆరలేదు. డోసింగ్ ఆపరేషన్ సమయంలో ఇద్దరు అగ్నిమాపక దళ సిబ్బంది గాయపడ్డారు" అని డెబ్తాను ఘోష్ అనే డివిజనల్ ఫైర్ ఆఫీసర్ తెలిపారు. కాగా ఇటీవల ఢిల్లీలోని గోకుపురి ప్రాంతంలోని స్లమ్ క్లస్టర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవ దహనం అయ్యారు. ఆ మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. ఈ ప్రమాదంలో దాదాపు 60 గుడిసెల్లో 30 పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతి చెందిన వారి కుటుంబానికి రూ.10 లక్షలు, చిన్నారులు చనిపోతే రూ. 5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.


By March 13, 2022 at 10:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/fire-breaks-out-at-godown-in-tangra-of-kolkata-and-12-hours-on-flames-continue/articleshow/90180185.cms

No comments