అఖండ 100 రోజుల జాతర.. గ్రాండ్ థ్యాంక్స్ మీట్.. ఇవిగో వివరాలు
చరిత్ర సృష్టించాలన్నా.. ఆ చరిత్రను తిరగ రాయాలన్నా బాలకృష్ణనే. సూపర్ డూపర్ హిట్స్ ఆయనకు కొత్తేమీ కాదు. తన సినీ కెరీర్‌లో ఎన్నో భారీ విజయాలందుకున్న ఆయన రీసెంట్‌గా బోయపాటితో కలిసి 'అఖండ' విజయం సాధించారు. కరోనా కష్టకాలంలో కూడా ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. నటసింహం గర్జనతో థియేటర్లు మార్మోగిపోయాయి. అంతేకాదు ఒకప్పుడు జనం చెప్పుకునే కన్నుల పండగల్లాంటి 50 రోజులు, 100 రోజుల వేడుకలను మరోసారి జనం ముందుకు తీసుకొచ్చింది ఈ . గతేడాది డిసెంబర్ నెలలో విడుదలై విజయవంతంగా 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది అఖండ సినిమా. భారీ విజయం అందుకోవడంతో చిత్రయూనిట్ తెగ సంబరపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రేక్షకలోకానికి కృతజ్ఞత చెప్పుకునేందుకు గాను గ్రాండ్ థ్యాంక్స్ మీట్ ప్లాన్ చేసి ఈ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేశారు. మార్చి 12న ఫంక్షన్‌ను కర్నూలులో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. అఖండ కృతజ్ఞత సభ పేరుతో ఈ వేడుక జరగనుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. బోయపాటి శ్రీను- కాంబోలో వచ్చి హాట్రిక్ హిట్ సాధించింది 'అఖండ' సినిమా. ఇందులో బాలయ్య బాబు నటన మాస్ అభిమానులకు పూనకాలు తెప్పించింది. రెండు పాత్రల్లో బాలయ్య నట విశ్వరూపం చూపించగా.. తమన్ బాణీలు గూస్ బంప్స్ తెప్పించాయి. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించి నిర్మాతలకు లాభాల పంట పండించిన ఈ సినిమా OTTలో విడుదలై కూడా సత్తా చాటింది. బాలయ్య బాబు సాధించిన ఈ 'అఖండ' విజయాన్ని నందమూరి ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు.
By March 10, 2022 at 10:52AM
No comments