Breaking News

Varun Tej : ‘గని’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్.. బాబాయ్‌ - అబ్బాయ్ పోటీ పడతారా?


మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ ‘గ‌ని’. క‌రోనా ప్ర‌భావం లేకుండా ఉండుంటే ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా ఎందుక‌నో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వ‌చ్చింది. గ‌త ఏడాది అక్టోబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ చివ‌ర మ‌ధ్య‌లోనూ గ‌ని చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలే జ‌రిగాయి. కానీ అస్స‌లు వీలు కాలేదు. కోవిడ్ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా సినిమా వాయిదా ప‌డింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు చ‌క్క బ‌డుతున్నాయి. థియేట‌ర్స్ అన్నీ క్ర‌మంగా ఓపెన్ అవుతున్నాయి. దీంతో టాలీవుడ్‌, బాలీవుడ్ స‌హా అంద‌రూ త‌మ సినిమాల రిలీజ్ డేట్స్‌ను అనౌన్స్ చేస్తూ వ‌స్తున్నారు. తాజాగా గ‌ని మూవీ మేకర్స్ వారి సినిమాను ఫిబ్ర‌వ‌రి 25 లేదా మార్చి 4న కానీ విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ రెండు తేదీల్లో అనుకూల‌మైన తేది రోజున గ‌ని చిత్రాన్ని విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. గ‌ని సినిమా కోసం వ‌రుణ్ తేజ్ బాక్స‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయ‌న చాలా క‌ష్ట‌ప‌డ్డారు. సిక్స్ ప్యాక్ పెంచారు. బాక్సింగ్‌ ప్రొఫెష‌న‌ల్‌గా క‌నిపించాల‌నే ఉద్దేశంతో అమెరికాకు వెళ్లి మ‌రీ ప్ర‌త్యేక‌మైన శిక్ష‌ణ‌ను తీసుకున్నారు. హాలీవుడ్ చిత్రం టైటాన్స్‌, బాలీవుడ్‌లో సుల్తాన్ వంటి చిత్రాల‌కు యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్ట‌ర్స్ లార్నెల్ స్టోవ‌ల్‌, వ్లాడ్ రింబ‌ర్గ్ ఈ చిత్రానికి యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేయ‌డం విశేషం. మిల్కీబ్యూటీ త‌మ‌న్నా ఈ సినిమా కోసం స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించ‌డం విశేషం. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే వ‌రుణ్ తేజ్ బాబాయ్‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా త‌న సినిమా భీమ్లా నాయ‌క్‌ను ఫిబ్ర‌వ‌రి 25 లేదా ఏప్రిల్ 1న విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. అంటే బాబాయ్ అబ్బాయి ఫిబ్ర‌వ‌రి 25నే త‌మ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం విశేషం. అంటే వీలును బ‌ట్టి ఫిబ్ర‌వ‌రి 25న ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేదా వ‌రుణ్ తేజ్ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, అల్లు బాబీ కంపెనీ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద‌, అల్లు బాబీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిరణ్ కొర్రపాటి దర్శకుడు.


By February 01, 2022 at 01:03PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/varun-tej-ghani-release-date-announcement/articleshow/89268868.cms

No comments