Breaking News

Chiranjeevi : ల‌తామంగేష్క‌ర్ దీదీ లేని లోటు తీర్చ‌లేనిది : చిరంజీవి


ప్ర‌ముఖ సీనియ‌ర్ గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ (92) ఆదివారం ఉద‌యం ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిట‌ల్‌లో క‌న్నుమూశారు. దాదాపు 29 రోజులుగా ఆమె చికిత్స తీసుకుంటూ వ‌స్తున్నారు. కోవిడ్ ల‌క్ష‌ణాల‌తో ఆమె హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. కానీ ప‌రిస్థితి చేయిదాటింది. ల‌తా మంగేష్క‌ర్ మ‌ర‌లి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. సినీ, సంగీతాభిమానులు ఆమె లేర‌నే వార్త తెలిసి శోక సంద్రంలో మునిగిపోయారు. యావ‌త్ భార‌తావ‌ని ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్ర‌మంలో టాలీవుడ్ అగ్ర క‌థానాయ‌కుడైన చిరంజీవి ట్విట్ట‌ర్ ద్వారా త‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. ‘‘నైటింగేల్ ఆఫ్ ఇండియా, గ్రేటెస్ట్ లెజెండ్ ల‌తా మంగేష్క‌ర్ దీదీ ఇక లేర‌నే వార్త తెలియ‌గానే నా గుండె బ‌ద్ద‌లైంది. ఆమె లేక‌పోవ‌డం వ‌ల్ల ఏర్ప‌డిని శూన్యాన్ని భ‌ర్తీ చేయ‌డం ఎవ‌రి వ‌ల్ల కాదు. ఆమె అద్భుత‌మైన జీవితాన్ని గ‌డిపారు. ఆమె సంగీతం, గాత్రంలోని మాధుర్యం శాశ్వ‌త‌మైన‌ది. సంగీతం ఉన్నంత కాలం అది ఉంటుంది. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి’’ అని తెలిపారు చిరంజీవి. 29 రోజులుగా ల‌తా మంగేష్క‌ర్ బ్రీచ్ కాండీ హాస్పిట‌ల్‌లోనే చికిత్స తీసుకున్నారు. అంతా కోలుకున్నార‌ని భావించిన త‌రుణంలో శ‌నివారం మ‌ళ్లీ ఆమె ఆరోగ్యం క్షీణించింద‌ని, ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని, వెంటిలేట‌ర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామ‌ని ఆమెకు వైద్యం అందిస్తున్న డాక్ట‌ర్ ప్ర‌తిత్ సందాని శ‌నివారం తెలిపారు. అయితే ప‌రిస్థితి చేయి దాట‌డంతో ఆమె ఆదివారం ఉద‌యం ప‌ర‌మ‌ప‌దించారు. 1942లో గాయనిగా కెరీర్‌ను ప్రారంభించారు. 20 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడారు. ఇప్పటికీ ఆమె పాటలు ప్రేక్షకులను ఆనందింప చేస్తూనే ఉన్నాయి. ఆమె లేరనే వార్త సినీ ప్రేమికులను, సంగీతాభిమానులను శోక సంద్రంలోముంచేసింది. గాన కోకిల పేరు పొందిన లతా మంగేష్క‌ర్‌కు 2001వ సంవత్సరంలో భారత అత్యున్నత పురస్కారమైన భారత రత్న దక్కింది.


By February 06, 2022 at 11:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/chiranjeevi-tributes-to-lata-mangeshkar/articleshow/89379683.cms

No comments