Breaking News

బీఎస్ఎఫ్ కాల్పుల్లో ముగ్గురు పాకిస్థాన్ స్మగ్లర్లు హతం.. 36 కేజీల మత్తుపదార్థాలు స్వాధీనం


జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు పాకిస్థాన్ స్మగ్లర్లను మట్టుబెట్టాయి. సాంబా సరిహద్దుల్లో అక్రమంగా దేశంలోకి చొరబడుతున్న ముగ్గురిని సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. వారిని లొంగిపోవాలని కోరినప్పటికి వారు పట్టించుకోలేదని, దీంతో వారిని హతమార్చామని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. వారి దగ్గర నుంచి ప్యాకెట్లలో ఉన్న 36 కేజీల హెరాయిన్‌‌ను స్వాధీనం చేసుకున్నారు. సాంబా సరిహద్దుల్లో ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు స్మగ్లర్ల కదలికలను భద్రతా దళం గుర్తించిందని, వారిని లొంగిపోవాలని కోరగా వారు దానిని పట్టించుకోలేదని బీఎస్ఎఫ్ డీఐజీ ఎస్‌పీఎస్ సంధు చెప్పారు. దాంతో బీఎస్ఎ‌ఫ్ భద్రతా దళం వారిపై కాల్పులు జరిపి హతమార్చిందని, వారి నుంచి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. అలాగే ఆ ప్రాంతంలో బీఎస్ఎఫ్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలోని ఇండో - పాక్ సరిహద్దు‌లో జనవరి 28వ తేదీన కూడా కాల్పులు జరిగాయి. అప్పుడు పాకిస్థాన్ స్మగ్లర్లతో బీఎస్‌ఎఫ్ కొద్దిసేపు కాల్పులు జరిపింది. కాల్పులు అనంతరం వారి దగ్గర నుంచి 47 కిలోల హెరాయిన్, రెండు పిస్టల్స్, కొన్ని మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. గత కొంతకాలంగా పాకిస్థాన్ స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


By February 06, 2022 at 10:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-pak-narcotic-smugglers-shot-dead-by-bsf-in-samba-sector-of-jammu-and-kashmir/articleshow/89378775.cms

No comments