Breaking News

నా బిడ్డ చావుకు కరోనా టీకాయే కారణం.. వెయ్యి కోట్లకు వైద్య విద్యార్థిని తండ్రి దావా


తీసుకోవడం వల్లే తన కుమార్తె చనిపోయిందని, తమకు రూ.1,000 కోట్ల పరిహారం చెల్లించాలంటూ ఓ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. వైద్య విద్యార్థిని అయిన తన కుమార్తె మరణానికి టీకా దుష్ప్రభావమే కారణమని ఆయన ఆరోపించారు. టీకాలు సురక్షితంగా ఉన్నాయని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ), ఎయిమ్స్ డైరెక్టర్‌లు సృష్టించిన తప్పుడు కథనాల వల్లే నా కుమార్తె లాంటి ఆరోగ్య సిబ్బంది వ్యాక్సిన్ తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. ఈ కథనాలను అధికారులు ధ్రువీకరించలేదన్నారు. ఈ మేరకు దిలీప్ లునావత్ అనే వ్యక్తి పిటిషన్ వేశారు. దిలీప్ కుమార్తె స్నేహా లునావత్ మెడిసిన్ చదువుతోంది. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభంలో ఫ్రంట్‌లైన్ వర్కర్లు ముందుగా టీకాలు వేశారు. ఈ క్రమంలో వైద్య విద్యార్థిని అయిన తన కుమార్తె 2021 జనవరి 28న టీకా తీసుకోగా.. దుష్ప్రభావాలు తలెత్తి అనారోగ్యానికి గురై మార్చి 1న చనిపోయిందని పేర్కొన్నాడు. అంతేకాదు, గతేడాది అక్టోబర్ 2న కేంద్ర ప్రభుత్వ AEFI కమిటీ.. తన కుమార్తె మరణానికి కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలే కారణమనిఅంగీకరించిందని లునావత్ వాదించారు. ‘‘నా కుమార్తెకు న్యాయం చేయాలని, సంబంధిత అధికార యంత్రాంగం ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల వల్ల హత్యకు గురయ్యే అవకాశం ఉన్న చాలా మంది వ్యక్తుల ప్రాణాలను కాపాడాలనీ ఈ పిటిషన్ దాఖలు చేశాను’’ అని పేర్కొన్నారు. న్యాయవాదులు అభిషేక్ మిశ్రా, దీపికా జైస్వాల్‌లు లునావత్ తరఫున రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈఓ అదర్ పూనావాలా, ఎస్ఐఐ భాగస్వామి బిల్ గేట్స్, మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ, డీసీజీఐ, ఎయిమ్స్ డైరెక్టర్‌లను ప్రతివాదులుగా చేర్చారు. కాగా, ఈ పిటిషన్‌పై రాష్ట్ర అధికారులను బాధ్యులుగా చేస్తూ.. ఇప్పటి వరకు వారి ఎఫ్ఏక్యూలను మార్చలేదని, టీకా దుష్ప్రభావాలకు చికిత్స ఉందని క్రూరమైన నేరపూరిత వైఖరిని కలిగి ఉన్నారని ఆరోపించారు. అలాగే, సీరమ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి ₹1000 కోట్ల మధ్యంతర పరిహారం చెల్లించేలా రాష్ట్ర అధికారులను ఆదేశించాలని కోరారు. అలాగే, టీకా దుష్ప్రభావాల కారణంగా సంభవించే మరణాల గురించి సరైన సమాచారాన్ని అణిచివేసే కుట్రలో భాగస్వాములైన గూగుల్, యూట్యూబ్, ఫేస్‌బుక్ మొదలైన సోషల్ మీడియా కంపెనీలపై తగిన చర్య తీసుకోవాలని కోరారు.


By February 02, 2022 at 09:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/petition-in-bombay-hc-for-seeks-1000-crore-compensation-his-daughter-death-from-covid-vaccine/articleshow/89289836.cms

No comments