నాపై దాడి వెనుక వాళ్లే ఉన్నారు… దేవుడే నన్ను రక్షించాడు : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ తన కారుపై జరిగిన కాల్పుల ఘటనపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు గాంధీని హత్య చేసిన వారే ఇప్పుడు తనపై దాడికి పాల్పడ్డారని ఆయన అన్నారు. శనివారం ఆయన భాగ్‌పత్ జిల్లా ఛప్రౌలీలో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాడి గురించి మాట్లాడారు. తనపై జరిగినా అల్లా తనను రక్షించాడని అసదుద్దీన్ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అసద్‌పై ఛాజర్సీ టోల్‌ప్లాజా వద్ద కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపినవారు అక్కడ ఆయుధాలను వదిలేసి పరారయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన ఇద్దరి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి బీజేపీతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలో అసదుద్దీన్ ఇలా అనడం ఆసక్తికరంగా మారింది. అయితే అసద్‌పై దాడి జరగడంతో కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్ కేటగిరి భద్రతను కల్పించగా దానిని ఆయన తిరస్కరించారు. దీనికి బదులు నిందితులపై ఊపా కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే దేశంలో మతసామరస్యాన్ని పెంపొందించాలని కోరారు. తనకు ఎటువంటి భద్రత వద్దని, ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నానని అన్నారు. తాను ఆంక్షల మధ్య కాకుండా స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నానని అన్నారు.
By February 06, 2022 at 09:43AM
No comments