Breaking News

Ravanasura : మాస్ మహరాజాను ఢీ కొట్టనున్న బ్యూటీ డాల్.. టాలీవుడ్‌లో మరో లేడీ విలన్!


అదేంటో మ‌న టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ రూట్ మార్చేస్తున్నారు.. రొటీన్‌కు భిన్నంగా ఆలోచిస్తున్నారా? లేక బోర్ కొట్టేస్తుందా? అని తెలియ‌డం లేదు కానీ.. వాళ్లు చేయాల్సిన ప‌నులను సైలెంట్‌గా చేసుకుంటూ వ‌చ్చేస్తున్నారు. ఇంత‌కీ ఏం చేస్తున్నార‌నేగా ఆలోచిస్తున్నారు. ప్ర‌తినాయ‌కుల విష‌యంలో మ‌న డైరెక్టర్స్ ఆలోచ‌న మారుతుంద‌ని ఇప్పుడు వ‌చ్చిన, రాబోతున్న సినిమాల‌ను చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు. యంగ్ డైరెక్ట‌ర్స్ తాము చేస్తున్న సినిమాల్లో లేడీ విల‌న్స్ పాత్రలను బలంగా రూపొందిస్తున్నారు. ఆ పాత్ర‌ల‌ను పోషించ‌డానికి కాస్త నేమ్, ఫేమ్ ఉన్న హీరోయిన్స్ కూడా ఓకే అంటున్నారు. ఇక స‌ద‌రు సినిమాల్లో న‌టిస్తున్న స్టార్ హీరోలు కూడా హీరోయిన్స్ విల‌నిజాన్ని ఎదుర్కొన‌డానికి సిద్ధంగా ఉంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు గ‌త ఏడాది విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ ‘క్రాక్‌’లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ లేడీ విల‌న్‌గా త‌న న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించి అందరితో శ‌భాష్ అనిపించుకుంది. ఇప్పుడు బాల‌కృష్ణ‌, గోపీచంద్ మ‌లినేని చిత్రంలోనూ ఆమె ప్ర‌తినాయ‌కి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. కాగా.. ఇప్పుడు మ‌రో లేడీ విల‌న్ కూడా తెలుగు సినిమాకు ప‌రిచ‌యం కానుంది. ఆమె ఎవ‌రో కాదు.. ద‌క్షాన‌గార్క‌ర్‌. పాత్ర న‌చ్చ‌డంతో స‌ద‌రు లేడీ విల‌న్ పాత్ర‌లో న‌టించ‌డానికి ద‌క్షా న‌గార్కర్ కూడా ఓకే చెప్పింద‌ట‌. ఇంత‌కీ ద‌క్ష న‌టించ‌నున్న చిత్ర‌మేదో తెలుసా? మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ హీరోగా న‌టించ‌నున్న ‘రావణాసుర‌’. సుధీర్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వితేజ హీరోగా రూపొంద‌నున్న చిత్రం ‘రావ‌ణాసుర‌’. జ‌న‌వ‌రి 14న సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుంది. ‘హుషారు, జాంబిరెడ్డి’ చిత్రాల్లో గ్లామ‌ర్‌గా క‌నిపించిన ద‌క్షా న‌గార్క‌ర్ ఇప్పుడు విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌ట‌మ‌నేది కాస్త కొత్త విష‌య‌మే. ఆమెకు స‌ద‌రు పాత్ర‌లోకి తీసుకోవాల‌ని హీరో, నిర్మాత‌ల‌ను ఒప్పించిన ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ‌ను అభినందించాల్సిందే. అంటే తెలుగు చిత్రాల్లో లేడీ విల‌న్ అంటే రీసెంట్ టైమ్స్‌లో వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ మాత్ర‌మే గుర్తుకు వ‌స్తున్నారు. తాజాగా ద‌క్షా న‌గార్క‌ర్ ఆ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌న్న‌మాట‌. రావ‌ణాసుర చిత్రంలో ర‌వితేజ లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ..‘’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈ సినిమాతో ర‌వితేజ నిర్మాత‌గా మారుతున్నారు. మ‌రీ సినిమాలో హీరోయిన్ ఇత‌ర న‌టీన‌టుల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది.


By January 06, 2022 at 09:01AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/daksha-nagarkar-is-going-to-turn-as-villain-for-ravi-teja-in-ravanasura/articleshow/88724769.cms

No comments