Breaking News

గుజరాత్‌లో గ్యాస్ లీకేజ్: ఆరుగురు మృతి.. మరో 20 మంది పరిస్థితి విషమం


గుజరాత్‌లో గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది అస్వస్థతకు గురయ్యారు. సూరత్‌లోని సచిన్ జీఐడీసీ ప్రాంతంలో ఓ సమీపంలో గ్యాస్ లీకేజ్ చోటుచేసుకుంది. దీంతో పదుల సంఖ్యలో అస్వస్థతకు గురికాగా.. వీరిలో ఆరుగురు చనిపోయారు. మరో 20 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ లీకేజ్ వల్ల ఊపిరాడక చనిపోయినట్టు అధికారులు ధ్రువీకరించారు. మరో 20 మంది సూరత్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ 20 మంది పరిస్థితి ఆందోళకరంగా ఉన్నా చికిత్సకు క్రమంగా స్పందిస్తున్నారని సివిల్ ఆస్పత్రి ఇంఛార్జ్ సూపరింటిండెంట్ ఓంకార్ చౌదురి తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అస్వస్థతకు గురైనవారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రింటింగ్ మిల్లు సమీపంలో ట్యాంకర్ ద్వారా రసాయనాలను డ్రెయినేజ్‌లో వదిలిపెడుతుండగా ప్రమాదవశాత్తూ గ్యాస్ లీకయ్యింది. ఏమి జరుగుతుందో చుట్టుపక్కల ప్రజలకు అర్థమయ్యే సమయానికి విష వాయువులు అప్పటికే ఆ ప్రాంతమంతా వ్యాపించింది. క్షణాల్లో ఐదుగురు వ్యక్తుల ప్రాణాలను తీసింది. మరో 20 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. మిల్లు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.


By January 06, 2022 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/six-people-died-and-20-others-critical-after-gas-leakage-in-surat-of-gujarat/articleshow/88724630.cms

No comments