Covid 19 : మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్..!
థర్డ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు చాలా మంది కరోనా బారిన పడుతున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు కరోనా ఎఫెక్ట్‌కి గురయ్యారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘కరోనా బారిన పడకుండా అన్నీ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా పాటిటివ్‌గా నిర్దారణ అయ్యింది. స్వల్పంగా లక్షణాలున్నాయి. ఇంట్లోనే క్వారంటైన్ అయ్యాను. ఈ మధ్య కాలంలో నన్ను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోండి. త్వరలోనే మీ అందరినీ కలుస్తాను’’ అని తెలిపారు. ఇంతక ముందు ఓసారి ఇలాగే చిరంజీవికి కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు చిరంజీవి వెంటనే తన సోషల్ మీడియాలో స్పందిస్తూ..తప్పుడు కరోనా కిట్‌తో పరీక్షించుకోవడం వల్ల పాజిటివ్ ఫలితం వచ్చిందని తను బాగానే ఉన్నానంటూ తెలియజేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యమైన పనులతో బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన సామాజిక దూరం పాటించేవారు. అయితే ఎలాగో ఆయన ఇప్పుడు కరోనా బారిన పడ్డారు. సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉండగా.. సెట్స్‌పై గాడ్ ఫాదర్, భోళా శంకర్, బాబీ సినిమాలున్నాయి. ఇవి కాకుండా వెంకీ కుడుముల సినిమాల చేయడానికి ఆయన రీసెంట్‌గానే ఓకే చెప్పారు. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘భోళా శంకర్’ సినిమా చిత్రీకరణలో చిరంజీవి పాల్గొంటున్నారు. చిరంజీకి కరోనా రావడంతో దాదాపు రెండు వారాల పాటు ఆయన సినిమా షూటింగ్స్ అన్నీ వెనక్కి వెళ్లినట్లే.
By January 26, 2022 at 09:34AM
No comments