చైనాకు పరోక్షంగా వార్నింగ్.. సవాళ్లను ఎదుర్కొంటామన్న ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే
సందర్భంగా జనరల్ నరవణే చైనాను పరోక్షంగా హెచ్చరించారు. 1949లో బ్రిటిష్ వారి నుంచి భారత్ సైన్యం కమాండర్ ఇన్ చీఫ్‌గా ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్పా బాధ్యతలు స్వీకరించినందుకు గుర్తుగా ప్రతి ఏడాది జనవరి 15న జాతీయ సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా నరవణే మాట్లాడారు. ముఖ్యంగా చైనా చర్యలను దృష్టిలో ఉంచుకుని ప్రసంగించారు. సమానత్వం, పరస్పర భద్రత సూత్రాల ఆధారంగా ఏర్పాటు చేసుకున్న నిబంధనల ద్వారానే వివాదాల పరిష్కారం జరుగుతుందని నరవణే అన్నారు. ఇతర దేశాల నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుందన్నారు. ఉగ్రదాడులను ఎదుర్కోవడానికి పటిష్ట ప్రణాళికలను సిద్ధం చేశామని చెప్పారు. దీనికోసం సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దేశ సరిహద్దుల్లో యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలని ఎదుర్కోవడానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. ఇండియా ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, దీనిని తప్పుగా అర్థం చేసుకోవద్దని హితవు పలికారు. కాగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా సైన్యం సేవలను కొనియాడారు. దేశ, జాతీయ భద్రతను కాపాడడ్ంలో భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం సైనికులు, మాజీ సైనికులు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత సైన్యం ప్రదర్శించిన ధైర్యసాహసాలు, వారి నైపుణ్యాన్ని ప్రశంసించారు. దేశ భద్రతకు వారు చేస్తోన్న త్యాగాల గురించి చెప్పేందుకు మాటలు సరిపోవన్నారు.
By January 15, 2022 at 12:25PM
No comments