Breaking News

ఆగని కరోనా ఉద్ధృతి… కొత్తగా 2.68 లక్షల కేసులు


దేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 2,68,833 కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,22,684 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 14 లక్షల 17 వేల 820 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రోజువారీ కోవిడ్ పాజిటివ్ రేటు 16.66 శాతంగా నమోదు అయ్యింది. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఒమిక్రాన్ కేసులు 6,041కి చేరాయి. 24 గంటల వ్యవధిలో కోవిడ్‌తో 402 మంది చనిపోయారు. మొత్తంగా 4.85 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అన్ని రాష్ట్రాల్లోనూ కోవిడ్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్రలో 43 వేల 211 కేసులు నమోదు అయ్యాయి. కర్ణాటకలో 28,723 మంది, ఢిల్లీలో 24,383 మంది కరోనా బారినపడ్డారు. తమిళనాడులో 23,459 మందికి, పశ్చిమ బెంగాల్‌లో 22,645 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. యూపీ, కేరళల్లో 16 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. రాజస్థాన్‌లో కొత్తగా 10,307 మంది వైరస్ బారిన పడ్డారు. బీహార్‌లో 6,500, ఏపీలో 4,528, మధ్యప్రదేశ్‌లో 4,755, తెలంగాణలో 2,398, చండీగఢ్‌లో 1,834 కేసులు నమోదయ్యాయి. విద్యార్థులు, రాజకీయ రంగ ప్రముఖులు, సెలబ్రిటీలు, వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బందితో సహా అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. దీంతో రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు ఇంకా అమలవుతూనే ఉన్నాయి. విద్యార్థుల భద్రత కోసం రాష్ట్రాల్లో స్కూళ్లు తెరవడంపై కీలక నిర్ణయాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతానికి పిల్లలకు ఆన్‌లైన్ పాఠాలే కొనసాగించాలని కేరళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది.


By January 15, 2022 at 11:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-records-268833-fresh-covid-cases-with-402-deaths-in-last-24-hours/articleshow/88911350.cms

No comments