పార్లమెంట్‌లో అగ్ని ప్రమాదం.. చెలరేగుతున్న మంటలు
దక్షిణాఫ్రికా పార్లమెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కేప్ టౌన్‌లోని ఉన్న ఈ భవనాల్లో ఆదివారం ఒక్కసారిగా మంటల చెలరేగాయి. భవనం, పైకప్పు నుంచి రావడంతో కొంత దూరం వరకూ పొగలు కమ్ముకున్నాయి. మొదటగా భవనంలోని మూడో అంతస్థులో మంటలు చెలరేగాయి. పార్లమెంట్ ఆవరణలోని పాత భవనాల్లో ఒకదాని తర్వాత ఒకదానిలో మంటలు వ్యాపించాయి. తర్వాత భవనాలపైభాగానికి మంటలు అంటుకున్నాయి. నేషనల్ అసెంబ్లీ భవనం కూడా మంటల్లో చిక్కుకుంది. భవనంపై భాగంలో అగ్ని జ్వాలలు కనిపిస్తున్నాయి. అయితే ఇంకా మంటలు అదుపులోకి రాలేదని, భవనం గోడలకు పగుళ్లు వచ్చాయని అక్కడ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకోగానే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. సిబ్బంది క్రేన్‌ను ఉపయోగించి కొన్ని చోట్ల మంటలను అదుపులోకి తెచ్చారు. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని అక్కడ అధికారులు వెల్లడించారు. కేప్‌టౌన్‌లోని పార్లమెంట్ హౌస్‌లో మూడు విభాగాలున్నాయి. ఇందులో కొత్త, పాత భవనాలు ఉన్నాయి. కొన్ని పురాతన భవనాల్లో తివాచీలు, సోఫాలతో అలకరించి ఉన్నాయి. ఈ భవనాలు 1920,1980లలో నిర్మించారు. కాగా గత ఏడాది ఏప్రిల్‌లో ప్రముఖ కేప్ టౌన్ విశ్వవిద్యాలయ లైబ్రరీలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల కారణంగా లైబ్రరీలో కొంత భాగం దగ్ధమైంది. ఇంకా ఈ ప్రమాదం నుంచి పూర్తిగా తేరుకోక ముందే ఇప్పుడు పార్లమెంట్‌లోనే ప్రమాదం సంబంధించింది.
By January 02, 2022 at 04:17PM
No comments