Breaking News

Aishwaryaa Rajinikanth : ధ‌నుష్ - ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ విడాకులు


కోలీవుడ్ హీరో ధ‌నుష్‌, త‌మిళ సూప‌ర్ స్టార్ కుమార్తె ఐశ్వ‌ర్యా ర‌జినీకాంత్ త‌మ వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లికారు. అధికారికంగా విడిపోతున్నామని త‌మ త‌మ అధికారిక‌ సోష‌ల్ మీడియా మాధ్య‌మాల ద్వారా తెలియ‌జేశారు. ‘‘స్నేహితులుగా, భార్యాభర్తలు, శ్రేయోభిలాషులుగా 18 సంవత్సరాలుగా కలిసి ప్రయాణించాం. ఇప్పుడు మా దారులు వేర‌య్యాయి. వాటిలో ప్ర‌యాణించ‌డానికి సిద్ధ‌మ‌య్యాం. నేను, ఐశ్వ‌ర్య విడిపోవాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మా వ్య‌క్తిగ‌త స‌మ‌యాన్ని వెచ్చించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. మా నిర్ణ‌యాన్ని గౌర‌వించండి. ఇలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోవ‌డానికి గోప్య‌త అవ‌స‌రం. దాన్ని మాకు క‌ల్పించండి’’ అని ధ‌నుష్ లేఖ‌లో పేర్కొన్నారు. అలాంటి లేఖ‌నే ఐశ్వ‌ర్యా ర‌జినీకాంత్ కూడా పోస్ట్ చేశారు. ఐశ్వ‌ర్య‌.. ర‌జినీకాంత్ పెద్ద కుమార్తె. 2004 న‌వంబ‌ర్ 18న వీరిద్ద‌రూ పెద్ద‌ల స‌మ‌క్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్ర‌, లింగ .. ఇద్ద‌రు కుమారులున్నారు. ఐశ్వ‌ర్య ద‌ర్శ‌కురాలిగా, సింగ‌ర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సినీ రంగంతో అనుబంధాన్ని ఏర్ప‌రుచుకున్న‌వారే. 3, వ‌య్ రాజా వ‌య్ చిత్రాల‌తో పాటు సినిమా వీర‌న్ అనే డాక్యుమెంట‌రీని డైరెక్ట్ చేశారు. యుగానికొక్క‌డు సినిమా త‌మిళ వెర్ష‌న్ ఆయ‌ర‌త్తిల్ ఒరువ‌న్‌కు ఈమె డ‌బ్బింగ్ చెప్పారు. ఇదే సినిమాలో పాట కూడా పాడారు. అలాగే విజిల్ సినిమాలోనూ ఓ పాట‌ను ఆల‌పించారు. ఇక హీరో ధ‌నుష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌మిళంతో పాటు తెలుగు, హిందీ ప్రేక్ష‌కుల‌కు కూడా ఈయ‌న సుప‌రిచితుడే. ఇప్పుడు తెలుగులో రెండు స్ట్ర‌యిట్ సినిమాలు చేస్తున్నారు. అందులో ఒక‌టి వెంకీ అట్లూరి ద‌ర్శ‌కత్వంలో సార్ అనే సినిమా, శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్నాయి. సార్ అనే సినిమా షూటింగ్ రీసెంట్‌గానే స్టార్ట్ అయ్యింది. ఇక శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో చిత్రం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. ALSO READ :


By January 18, 2022 at 05:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-dhanush-announces-seperation-from-aishwaryaa-rajinikanth/articleshow/88962153.cms

No comments