Breaking News

RRR ప్రభంజనం.. విడుదలకు ముందే ఆ ఘనత సాధించిన తొలి భారతీయ సినిమాగా రేర్ ఫీట్


యావత్ భారతదేశం వేయికన్నులతో ఆతృతగా ఎదురు చూస్తున్న భారీ సినిమా . మెగా పవర్ స్టార్ , యంగ్ టైగర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌలి రూపొందిస్తున్న ఈ సినిమాపై అన్ని వర్గాల ఆడియన్స్ ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలు రీచ్ అయ్యేలా ఇప్పటికే పలు అప్‌డేట్స్ రిలీజ్ చేసిన జక్కన్న.. ఈ సినిమాను జనవరి 7న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ భారీ సినిమా గురించిన చర్చలే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో RRR సత్తా ఏంటనేది ప్రపంచానికి తెలిసేలా విడుదలకు ముందే ఈ సినిమా రికార్డుల సునామీ సృష్టిస్తోంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా తాజాగా RRR మరో అరుదైన ఘనత సాధించింది. సినిమాకు ఉన్న భారీ డిమాండ్ దృష్ట్యా ఈ మూవీ భారత దేశంలోనే గాక యూఎస్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రీమియర్స్ టికెట్స్ రూపంలో 1 మిలియన్ యూఎస్ డాలర్స్‌ను దాటేసింది. దీంతో ఓవర్సీస్‌‌లో ఈ మేర ప్రీమియర్స్ వసూళ్లు రాబట్టిన తొలి భారతీయ సినిమాగా ట్రెండ్ సెట్ చేసింది. మరోవైపు తనదైన స్ట్రాటజీతో RRR ప్రమోషన్స్ చేపడుతున్నారు జక్కన్న. దాదాపు 12 భాషల్లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అంతటా హైప్ క్రియేట్ చేస్తున్నారు. ముంబై, చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలను చుట్టేస్తూ RRR మూవీపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేస్తున్నారు. ఈ మేరకు రీసెంట్‌గా ముంబైలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించిన రాజమౌళి.. త్వరలో హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, బాలకృష్ణ ముఖ్య అతిథులుగా రానున్నారని తెలుస్తోంది. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందిన ఈ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించగా.. అల్లూరి సీతారామరాజు రోల్‌లో రామ్ చరణ్ కనిపించనున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్, శ్రీయ కీలకపాత్రలు పోషించారు.


By December 24, 2021 at 12:37PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rajamouli-rrr-rare-feet-in-us-market-before-release/articleshow/88469640.cms

No comments