ప్రభాస్ అలా అన్నప్పుడు పక్కన పెట్టాలనుకున్నాను : ‘ఆది పురుష్’ డైరెక్టర్ ఓం రౌత్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీస్‌లో ఒకటి. మన ఇతిహాసం రామాయణంను దర్శకుడు ఆది పురుష్‌గా తెరకెక్కిస్తున్నారు. టాక్ టెక్నాలజీతో రూపొందుతోన్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ప్రభాస్ రాముడు.. కృతిసనన్ సీత.. సైఫ్ అలీఖాన్ రావణాసురుడు.. పాత్రలను పోషించారు. ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆగస్ట్ 11, 2022లో సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ ఓం రౌత్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ‘‘రామాయణం 7 వేల సంవత్సరాల క్రితం జరిగిన కథ. వాల్మీకి రామాయణాన్ని నా కోణంలో చూపించబోతున్నాను. అలాగే మొత్తం రామాయణాన్ని మూడు గంటల్లో చూపించడం అంటే కష్టతరం. కాబట్టి, ఓ కీలక భాగాన్ని మాత్రమే అందులో చూపించబోతున్నాం. అదేంటనేది వెండితెరపై చూడాల్సిందే. దాన్ని మాటల్లో చెప్పాలంటే కష్టం. స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత రాముడుగా ఎవరైతే బావుంటారనుకోగానే నాకు ప్రభాస్‌గారే గుర్తుకొచ్చారు. ఆ పాత్ర చేయాలంటే స్వచ్చమైన మనస్సున్న నటుడు కావాలి. కల్మషం లేని వ్యక్తిత్వం ఆయన కళ్లలో కనిపిస్తుండాలి. అవన్నీ నాకు ప్రభాస్‌లో కనిపించాయి. స్క్రిప్ట్ విన్న తర్వాత ప్రభాస్ చేయనని అనుంటే, స్క్రిప్ట్‌ను పక్కన పెట్టేద్దామని అనుకున్నాను. కానీ విన్న వెంటనే ప్రభాస్‌గారు ఓకే చెప్పారు. ఆది పరుష్‌లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వాడుతున్నాం. కథానుగుణంగా ఇందులో వన్య ప్రాణులను కూడా చూపించాల్సి ఉంటుంది. అందుకోసం బడ్జెట్ పెరిగినా ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించాలని అనుకున్నాను. రేపు సినిమాను వెండితెరపై చూస్తున్నప్పుడు ప్రేక్షకుడు ఓ కొత్త అనుభూతికి లోనవుతాడు’’ అన్నారు. అంతే కాదు.. విడుదల తేది గురించి మాట్లాడుతూ రిలీజ్ డేట్‌లో ఎలాంటి మార్పూ ఉండబోదని తెలిపారు. ప్రస్తుతం హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ ..సంక్రాంతి సందర్భంగా జనవరి 14, 2022లో విడుదలవుతుంది. ఇదొక పీరియాడిక్ లవ్ స్టోరి. ఇది కాకుండా సలార్ మూవీ చిత్రీకరణను ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. ఇది కూడా పూర్తి కావస్తుంది. అలాగే మరో వైపు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మూవీ షూటింగ్‌ను కూడా ప్రభాస్ షురూ చేసిన సంగతి తెలిసిందే.
By December 25, 2021 at 08:15AM
No comments