Breaking News

బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 32 మంది సజీవ దహనం


బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ప్రయాణికుల నౌకలో మంటలు చెలరేగి 32 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢాకా నుంచి ఓ మూడంతస్తుల ప్రయాణికుల బరుంగా వెళుతుండగా.. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జులోకఠి ప్రాంతంలోని సుగంధ నది మధ్యలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో నౌకలో సుమారు 500 మంది ప్రయాణిస్తున్నారు. పడవలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకునేందుకు కొందరు నదిలోకి దూకారు. మరికొంత మంది మంటల్లో చిక్కుకోవడంతో 32 మంది సజీవ దహనమైనట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెప్పారు. షిప్ యార్డుల్లో నిర్వహణ సరిగా లేకపోవడం, రద్దీ ఎక్కువ కావడం, ప్రమాణాలను పాటించకపోవడం వల్ల బంగ్లాదేశ్‌లో తరచూ ఇలాంటి అగ్ని చోటు చేసుకుంటున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలైలో ఢాకా సమీపంలోని రూప్‌గంజ్‌లో ఉన్న ఓ బేవరేజ్ ఫ్యాక్టరీలో సంభవించిన అగ్ని ప్రమాదంలో 52 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. ఫిబ్రవరి 2019లో ఢాకా అపార్ట్‌మెంట్స్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన రసాయనాల కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 70 మందికిపై మరణించారు. ఆగస్టులో జరిగిన బోటు ప్రమాదంలో కనీసం 21 మంది ప్రాణాలు కోల్పోయారు.


By December 24, 2021 at 11:42AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/fire-accident-in-bangladesh/articleshow/88468732.cms

No comments