RRR Trailer...గూజ్ బమ్స్ తెప్పించిన జక్కన్న..మెగా, నందమూరి అభిమానులకు పూనకాలే
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తోన్న భారీ చిత్రం RRR. డిసెంబర్ 9న ట్రైలర్ విడుదలవుతుందని ముందు నుంచి చెబుతూ వస్తున్నారు. చెప్పినట్లే RRR ట్రైలర్‌ను ఉదయం 11 గంటలకు విడుదల చేసింది చిత్ర యూనిట్. ట్రైలర్‌లో ప్రతి సన్నివేశం గూజ్ బమ్స్ తెప్పించేలా ఉంది. ఈ ట్రైలర్‌తో ఒకవైపు నందమూరి అభిమానులు, మరోవైపు మెగా అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారనే చెప్పాలి. ట్రైలర్‌ను ఆ రేంజ్‌లో కట్ చేసి సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచారు దర్శకధీరుడు. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 7న విడుదల చేస్తున్నారు. ట్రైలర్ విషయానికి వస్తే... ఓ చిన్న అమ్మాయిని బ్రిటిష్ స్కాట్ దొర తన పని పిల్లగా ఉండటానికి తీసుకొచ్చేస్తాడు. ఆ పిల్ల గోండ్ల పిల్ల.. ఆ విషయాన్ని ఆ దొరకు, అతని దగ్గర పనిచేసే మరో అధికారి చెబుతాడు. ఏం గోండ్లకు కొమ్ములుంటాయా? అని ప్రశ్నిస్తే.. కాదు.. ఓ కాపరి ఉంటాడు అని సదరు అధికారికి చెప్పగానే గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రధారి అయిన ఎన్టీఆర్‌ను చూపించారు. పులితో ఎన్టీఆర్ చేసే ఫైట్.. దానికి ముఖం మీద తన ముఖం ఉంచి గ్రాండించే సీన్ స్టనింగ్.. పులిని వేటాడాలంటే వేటగాడు కావాలి.. ఆ పని ఒకడే చేయగలడు సార్! అనగానే మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రను పరిచయం చేశారు. ఆ పాత్ర బ్రిటీష్ వాళ్ల దగ్గర పనిచేసే పోలీస్ ఆఫీసర్ పాత్ర కనిపిస్తుంది. ఇక ఇద్దరూ చెరో వైపు దారంతో ఊగుతూ వచ్చి చేతులు పట్టుకుని నీటిపై నిలబడటం.. వారిపై ఉన్న వంతెన, దానిపై ఉన్న రైలు పేలిపోవడం సీన్ సింప్లీ సూపర్బ్.. ఇక సీతా రామరాజు, కొమురం భీమ్ పాత్రల మధ్య ఉన్న స్నేహం.. ఆ సందర్భంలో వచ్చే అందమైన సన్నివేశాలు పాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతమన్నా..అని ఎన్టీఆర్ తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్ చరణ్ గుర్రంపై, ఎన్టీఆర్ బైక్‌పై చేసే రైడింగ్ సన్నివేశాలు.. చరణ్‌ను ఎత్తుకుని ఎన్టీఆర్ ఎగిరే సన్నివేశాలు.. సీత పాత్రధారి అయిన ఆలియా భట్.. బ్రిటిష్ దొరసాని అయిన ఒలివియా మోరిస్ పాత్రలను కూడా ఇందులో చూడొచ్చు. అలాగే సముద్రఖని, అజయ్ దేవగణ్, శ్రియా శరన్, రాజీవ్ కనకాల పాత్రలు ట్రైలర్‌లో వీరోచితంగా కనిపిస్తున్నాయి. తొంగి తొంగి నక్కి నక్కి కాదే.. తొక్కుకుంటూ పోవాలే.. ఎదుర్కొచ్చినోడ్ని ఏసుకుంటూ పోవాలే.. అని ఎన్టీఆర్ ఎమోషనల్ డైలాగ్.. ఆ సందర్భంలో ఎన్టీఆర్ - చరణ్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలను కూడా ట్రైలర్‌లో చూపించారు. యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటా అవే వస్తాయి.. అని అజయ్ దేవగణ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్.. తర్వాత నిప్పుల మధ్య నుంచి అల్లూరి గెటప్‌లో రామ్‌చరణ్ విల్లంబులు చేతపట్టి బ్రిటీష్ వారిని చంపేసీన్స్ వస్తాయి. మరో వైపు గోండు బెబ్బులిగా ఇక ట్రైలర్ చివరలో భీమ్.. ఈ నక్కల వేట ఎంత సేపు.. కుంభస్థలాన్ని బద్దలు గొడదాం పద! అనగానే ఇద్దరూ కలిసి బ్రిటీష్ సైన్యాన్ని చంపే సీన్స్ ఎక్స్‌ట్రార్డినరీ.. ఈ ట్రైలర్‌తో సినిమాలోని ఎమోషనల్ యాంగిల్, యాక్షన్, స్నేహం, శత్రుత్వం అన్నింటినీ సింపుల్‌గా చూపించాడు దర్శకధీరుడు రాజమౌళి. ప్రీ ఇండిపెండెన్స్ 1920 బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతోన్న RRR సినిమాలో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్ కనిపిస్తోన్న సంగతి తెలిసిందే. బ్రిటీష్‌వారిని వీరిద్దరూ ఎలా ఎదిరించారనేదే కథాంశం. సినిమా ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. రన్ టైమ్‌ను 3 గంటల 6 నిమిషాలుగా ఫిక్స్ చేసేశారని టాక్.
By December 09, 2021 at 11:06AM
No comments