Breaking News

టికెట్ ధ‌ర‌ల్లో కోత.. ఏపీ ప్ర‌భుత్వంపై సి.క‌ళ్యాణ్ ఘాటు వ్యాఖ్య‌లు


ప్ర‌స్తుతం క‌రోనా కంటే ఏపీలోని టికెట్ ధ‌ర‌ల‌పై సినీ పరిశ్ర‌మ‌లో టెన్ష‌న్ ఎక్కువైంది. రీసెంట్‌గా జ‌రిగిన అసెంబ్లీ స‌మావేశాల్లో థియేట‌ర్స్‌లో టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో విక్ర‌యించాల‌ని చ‌ట్ట స‌వ‌ర‌ణ చేసిన ప్ర‌భుత్వం.. నిర్ణ‌యించిన ధ‌ర‌ల‌కే టికెట్స్ అమ్మాల‌ని, బెనిఫిట్స్ షోస్ వేయ‌కూడ‌ద‌ని కూడా స్ప‌ష్టం చేసింది. ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై సంతోషాన్ని వ్య‌క్తం చేసినప్ప‌టికీ టికెట్ ధ‌ర‌ల‌పై సినీ ప్ర‌ముఖులు అంద‌రూ పెదవి విరుస్తున్నారు. తాజాగా సీనియ‌ర్ నిర్మాత సి.క‌ళ్యాణ్ కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌ల‌పై తీసుకున్న నిర్ణ‌యంపై స్పందించారు. ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై సినీ ప‌రిశ్ర‌మ‌లో ఎవ‌రూ సంతోషంగా లేర‌ని అన్నారు. త‌న పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సి.క‌ళ్యాణ్ పలు విషయాలపై మాట్లాడారు. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వం ఏదో మేలు చేస్తున్న‌ట్లు భావించ‌వ‌చ్చు. మరీ ఇంత‌గా త‌గ్గించ‌డం భావ్యం కాదు. ఒక వ‌స్తువును త‌యారు చేసుకున్న వ్య‌క్తిగా దాని ధ‌ర‌ను నిర్జయించుకుంటాను. సినిమా చూడాలా.. వ‌ద్దా? అనేది ప్రేక్ష‌కుల ఇష్టం. దానిపై ఎవ‌రూ బ‌ల‌వంతం చేయ‌డం లేద‌ని..దీనిపై మ‌రోసారి ప్ర‌భుత్వానికి విన్న‌వించే ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌న్నారు సి.క‌ళ్యాణ్‌. ‘‘ప్ర‌స్తుతం ఈయ‌న స‌త్య‌దేవ్‌తో గాడ్సే అనే సినిమాను నిర్మించాం. త‌ల్లిదండ్రులు క‌ష్ట‌ప‌డి చ‌దివిస్తే చ‌దువుకున్న యూత్‌, ఏదో చేయాల‌ని అనుకుని, ఏమీ చేయ‌లేక స‌త‌మ‌త‌మైయ్యే కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్ర‌మే గాడ్సే. ఇదొక పీరియాడిక్ మూవీ. జ‌న‌వ‌రి 26న విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తున్నాం. జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం. నిర్మాతగా అలాంటి సినిమా చేయడంపై సంతోషంగా ఉన్నాను. అంద‌రి స‌మ‌స్య‌ల‌ను ప్ర‌తిబింబించేలా, ప్ర‌భుత్వాల‌ను ప్ర‌శ్నించేలా గాడ్సే సినిమా ఉంటుంది’’ అన్నారు. గాడ్సే సినిమా త‌ర్వాత బ్ల‌ఫ్ మాస్ట‌ర్ ద‌ర్శ‌కుడు గోపీ గ‌ణేష్‌తో ఓ సినిమాను, స‌త్య‌దేవ్‌తోనే మ‌రో సినిమాను రూపొందించబోతున్నాన‌న్నారు సి.క‌ళ్యాణ్‌. బాల‌కృష్ణ‌తో రూల‌ర్ సినిమా త‌ర్వాత మ‌రో సినిమాను కళ్యాణ్ నిర్మించ‌లేదు. మ‌ధ్యలో కార‌ణంగానూ ఆయ‌న సినిమాల‌కు బ్రేక్ వ‌చ్చింది. దాదాపు రెండేళ్ల త‌ర్వాత ఆయ‌న నిర్మాణంలో రూపొందిన సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి.


By December 09, 2021 at 10:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/c-kalyan-sensational-comments-on-theatres-ticket-price-and-ap-government/articleshow/88179390.cms

No comments