కెమెరా ఆన్‌లో ఉందనే విషయం మర్చిపోయి రాసలీలలు.. జడ్జి ముందు అడ్డంగా బుక్కైన లాయర్
కోవిడ్ వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం వర్చువల్ విధానంలోకి మారింది. ప్రైవేట్ సెక్టార్ నుంచి.. పబ్లిక్ రంగం వరకూ అన్ని ఆన్‌లైన్ విధానంలోకి వచ్చేశాయి. వ్యక్తులు ఎక్కడున్నా కంప్యూటర్‌లో కెమెరా ఆన్ చేసి పనిచేసుకునే వెసులుబాటు వచ్చింది. అయితే దీనినే కొంతమంది అవకాశంగా తీసుకుంటుండగా.. కొంతమంది కెమెరా ఆన్‌లో ఉందన్న విషయం మరిచి సొంత పనులు చేసుకుంటున్నారు. అంతవరకూ ఒకే.. కొంతమంది శృతి మించిపోతున్నారు. అలాంటి ఘటనే చెన్నైలో జరిగింది. కెమెరా ఆన్ చేసి ఉందనే విషయాన్ని మరిచిపోయి వాదనల మధ్యలోనే ఓ లాయర్ మహిళతో రాసలీలల్లో మునిగిపోయాడు. దానిని జడ్జితో సహా అందరూ చూశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కూడా కొడుతుంది. సోమవారం చెన్నై హైకోర్టులో ఓ కేసుకు సంబంధించి వర్చువల్‌గా వాదనలు జరిగాయి. ఈ కేసులో ఆర్డీ సంతాన కృష్ణన్ తనవైపు వాదనలు వినిపించాడు. తర్వాత అవతలి వారి వైపు లాయర్లు వాదనలు వినిపిస్తున్నారు. అయితే అప్పటికే కెమెరా ఆన్ చేసి ఉంది. అది మరిచిపోయిన అడ్వకేట్ సంతాన కృష్ణన్ ఓ మహిళతో జరిపాడు. దీనిని వర్చువల్‌గా వాదనల్లో పాల్గొన్న అందరూ చూశారు. దాంతో జడ్జి సీరియస్ అయి ఆ లాయర్‌ను సస్పెండ్ చేశారు. ఏ కోర్టులో వాదించకుండా నిషేధం విధించాలని బార్ కౌన్సిల్‌కు కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హైకోర్టు దీనిని కోర్టు ధిక్కారణ కేసుగా స్వీకరించింది. ఐటీ చట్టాల ప్రకారం స్థానిక సీబీసీఐడీ పోలీసులకు అప్పగించింది. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అంతేకాదు అయిన వీడియోను ఇంటర్ నెట్ నుంచి తొలగించాలని పోలీసులను ఆదేశించింది. ఆన్‌లైన్ విధానం అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి పలువురు అధికారులు తప్పిదాలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది తమ పనులను వదిలేసి హాయిగా పడుకుంటున్నారు. ఎవరూ చూశారులే అనుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇలాంటి కొన్ని ఘటనలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. అయతే ఇప్పటికీ కొంతమంది ఇంకా ఇలా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు.
By December 23, 2021 at 10:56AM
No comments