Breaking News

విజయ్ దేవరకొండ ‘లైగర్’ రిలీజ్ డేట్ ఫిక్స్... రౌడీ ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా ఇచ్చిన పూరి


రౌడీ హీరో , మాస్ డైరెక్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లైగ‌ర్‌’. ఇది బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోంది. సినిమాను భారీ రేంజ్‌లో విడుద‌ల చేసేలా తెలుగు, హిందీ భాష‌ల్లో సినిమాను తెలుగు, హిందీల్లో రూపొందించినప్పటికీ తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అనువాదం చేసి విడుదల చేస్తున్నారు. అంటే పాన్ ఇండియా రేంజ్ మూవీగా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్ కాబ‌ట్టి.. త‌నదైన స్టైల్లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్‌ను ఓ కీల‌క పాత్ర‌లో న‌టింప చేయ‌డానికి ఒప్పించ‌డ‌మే కాదు.. రీసెంట్‌గా మైక్ టైస‌న్ పాత్ర చిత్రీక‌ర‌ణ కూడా పూర్తి చేసేశారు డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్‌. లేటెస్ట్‌గా ‘లైగర్’ సినిమా నుంచి డబుల్ ధమాకాగా రెండు అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్. ఇంతకీ పూరీ జగన్నాథ్, ఛార్మి అండ్ టీమ్ ఇచ్చిన రెండు అప్ డేట్స్ ఏంటో తెలుసా?.. ఒకటి ‘లైగర్’ సినిమా రిలీజ్ డేట్.. సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించేశారు. ఇక రెండో అప్ డేట్ ఏంటంటే.. కొత్త సంవత్సరం కానుకగా డిసెంబర్ 31న ‘లైగర్’ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నారు. తమ అభిమాన రౌడీ హీరోను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా? అని అనుకున్న ఆయన అభిమానులు మరి కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు. ‘లైగ‌ర్‌’ మూవీ ఇప్పుడు చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేయ‌డంతో పాటు ఛార్మితో క‌లిసి పూరీ జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరీ కనెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మిస్తున్నారు. అలాగే ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌క నిర్మాత క‌ర‌ణ్ జోహార్ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్‌తో పూరి త‌న‌దైన స్టైల్లో సిల్వ‌ర్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేస్తున్నారు.పూరీ జ‌గ‌న్నాథ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, అన‌న్య పాండే ఇలా మొత్తం యూనిట్‌కు లైగ‌ర్ తొలి పాన్ ఇండియా మూవీ. ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి.


By December 16, 2021 at 10:25AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vijay-deverakonda-puri-jagannadh-movie-liger-release-date-liger-gilmpse-release-date-liger-updates/articleshow/88311776.cms

No comments