ప్రముఖ దర్శకుడు మృతి.. రోడ్డు పక్కన అనాథ శవంలా పడి ఉండటంతో! రంగంలోకి పోలీసులు


కోలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు బ్లాక్ బస్టర్ సినిమాలకు పని చేసిన దర్శకుడు త్యాగరాజన్ బుధవారం ఉదయం చెన్నైలో మృతి చెందారు. అయితే ఆయన రోడ్డు పక్కన అనాథ శవంలా పడి ఉండటం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రభు కథానాయకుడిగా వెట్రిమేల్ వెట్రి, విజయకాంత్ హీరోగా మా నగర కావలన్ వంటి విజయవంతమైన చిత్రాలను ఆయన రూపొందించారు. అరుప్పుకోట్టై నుంచి వచ్చిన త్యాగరాజన్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి. 'పొన్ను పార్క పరేన్'తో చిత్రసీమలోకి వచ్చి 'వెట్రిమేల్ వెట్రి' సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆయనలో అద్భుతమైన స్క్రీన్ ప్లే టాలెంట్ ఉండటంతో విజయ్‌కాంత్‌తో పని చేసే అవకాశం అందుకున్నాడు. అలా ఆయన తెరకెక్కించిన 'మా నగర కావల్' ఘన విజయం సాధించింది. అయితే ఆ తర్వాత ఆయనకు చెప్పుకోదగిన అవకాశాలు రాకపోవడంతో కృంగిపోయారని సమాచారం. కాగా, AVM సంస్థలో పనిచేసిన త్యాగరాజన్.. అదే AVM స్టూడియో సమీపంలో రోడ్డు పక్కన అనాథగా చనిపోయిన ఘటన కోలీవుడ్‌లో సంచలనగా మారింది. త్యాగరాజన్ మృత దేహాన్ని అనాథ శవంగా భావించి మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు పోలీసులు.
By December 09, 2021 at 10:20AM
No comments