Breaking News

యువతి పెళ్లిలో ఊహించని ట్విస్ట్.. పరిగెత్తుకొచ్చి, వరుడికి మైండ్ బ్లాంక్?


ప్రియురాలిని మరొకరికిచ్చి ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేయడానికి సిద్ధపడటం.. ఇంతలో ప్రేమించిన వ్యక్తి వచ్చి అడ్డుకుని ప్రేయసిని దక్కించుకోవడం ఇలాంటి సన్నివేశాలను సినిమాల్లోనే చూస్తాం. అయితే, నిజజీవితంలోనూ అప్పుడప్పుడూ జరుగుతుంటాయి. తాజాగా, వివాహ వేదికపై వధూవరులు కూర్చొని ఉండగా.. ముహూర్తానికి కొన్ని సెకెన్లు ముందు సెడెన్‌గా మాజీ ప్రియుడు ఎంట్రీ ఇచ్చాడు. నేరుగా మండపంపైకి వెళ్లిన అతడు.. మాజీ ప్రేయసి నుదుట సింధూరం దిద్దాడు. దీంతో అక్కడివారంతా షాకయ్యారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఈ ఘటన చోసుకోగా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. కళ్యాణవేదిక చుట్టూ జనం చూస్తుండగా.. దండలు మార్చుకునేందుకు వధూవరులు సిద్ధయ్యారు. కొన్ని సెకన్లలో దండలు మార్చుకుంటారనగా మాజీ ప్రియుడు వేదికపై ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యాడు. అందరూ చూస్తుండగానే.. జేబులోంచి కుంకుమ తీసి ఆమె నొసటన దిద్దాడు. ఈ హఠాత్పరిణామానికి వివాహానికి వచ్చిన బంధువులు, అతిథులు నిశ్చేష్టులయ్యారు. ఈ షాక్‌ నుంచి తేరుకునేలోపు అతడు అక్కడ నుంచి పారిపోయాడు. అయితే, అర్ధాంతరంగా ఆగిపోయిన ఈ వివాహం.. మరుసటిరోజు ఉదయం జరిగింది. తల్లిదండ్రులు చూసిన యువకుడినే యువతి పెళ్లాడింది. డిసెంబరు 1న జరిగిన ఈ తతంగం మొత్తాన్ని అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వధువు ప్రియుడు కొద్ది నెలల కిందట ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లాడు. దీంతో అమ్మాయి తల్లిదండ్రులు వేరే అబ్బాయితో ఆమెకు పెళ్లి నిశ్చయించారు. ప్రియురాలు మరొక వ్యక్తితో పెళ్లికి సిద్ధమైనట్టు తెలుసుకున్న యువకుడు... ఎలాగైనా దానిని భగ్నం చేయాలని నిర్ణయించుకున్నాడు. చివరకు పెళ్లి రోజున ఆమె నుదుటన సింధూరం దిద్ది వెళ్లిపోయాడు. ఈ ఘటనపై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని.. యువకుడ్ని మందలించి వదిలేశారు.


By December 09, 2021 at 09:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ex-boyfriend-puts-sindoor-in-brides-maang-in-front-of-groom-in-gorakhpur-of-uttar-pradesh/articleshow/88178045.cms

No comments