Breaking News

ఇకనైనా ప్రేమను, ద్వేషాన్ని కొనుక్కోవడం మానేయాలి.. సిద్దార్థ్ సెన్సేషనల్ కామెంట్స్! కారణం సమంత?


ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని టాపిక్స్‌లో ప్రధానమైంది సమంత- నాగ చైతన్య డివోర్స్ ఇష్యూ. నిజానికి ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నా నేటికీ విడాకుల అంశం చర్చల్లో నిలుస్తూనే ఉంది. చై- సామ్ విడాకులు తీసుకోబోతున్నారనే రూమర్స్ స్టార్ట్ అయింది మొదలు నేటి వరకు ఈ టాపిక్ జనాల్లో హాట్ టాపిక్ గానే ఉంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషించే సమంత పెడుతున్న పోస్టులు, వాటి అర్థాలు, ఆ పోస్టుతో ఆమె ఏం చెప్పాలనుకుంటోంది? ఇలా ఎన్నో రకాల అనుమానాలతో ఇష్యూ వైరల్ అవుతోంది. ఈ పరిస్థితుల నడుమ హీరో చేసిన ఓ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. నాగ చైతన్యతో సమంత డివోర్స్ కన్ఫర్మ్ చేశాక సిద్దార్థ్ చేసిన ఓ ట్వీట్ నెట్టింట రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మోసం చేసిన వారు ఎప్పటికీ బాగు పడలేరు.. స్కూల్‌లో టీచర్లు నేర్పిన పాఠం అదే అంటూ సిద్దార్థ్ చేసిన కామెంట్స్ వైరల్ అయి పలు చర్చలకు తావిచ్చాయి. ఈ క్రమంలోనే మరోసారి సిద్దార్థ్ తన మాటలకు పదును పెడుతూ ఓ ట్వీట్ పెట్టడం, అది చూసిన నెటిజన్లు సమంతను ఉద్దేశించే సిద్దార్థ్ ఈ వ్యాఖ్యలు చేశారని కామెంట్స్ పెడుతుండటం నెట్టింట సెన్సేషన్ అవుతోంది. నాగ చైతన్య,-సమంతల విడాకుల విషయంలో సమంతపై నెగెటివ్ కామెంట్లు చేసే వారు ఎంత మంది ఉన్నారో.. పాజిటివ్ కామెంట్లు చేసే వారు కూడా అంతే ఉన్నారు. అయితే వీటిని పెద్దగా పట్టించుకోని సామ్.. రీసెంట్‌గా రియాక్ట్ అయింది. సోషల్ మీడియా నటీనటుల్ని తమ అభిమానులకు చేరువ చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పిన సమంత.. కొంతమంది నెటిజన్ల నుంచి ప్రేమాభిమానాలు పొందుతున్నానని, ప్రస్తుతం వాళ్లు తన జీవితంలో భాగమైపోయారని తెలిపింది. కానీ.. మరికొంత మంది మాత్రం అసభ్యకరమైన కామెంట్లతో ట్రోల్‌ చేస్తున్నారని, వారందర్నీ కోరేది ఒక్కటే.. తాను చేసే ప్రతిదాన్ని అంగీకరించాలని డిమాండ్‌ చేయను కానీ, మీ అభిప్రాయాలు వ్యక్తపరచడానికి ఓ విధానం ఉంటుందని పేర్కొంది. అనాగరికంగా వ్యవహరించవద్దని అభ్యర్థించింది. సరిగ్గా సమంత ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే సిద్దార్థ్ రంగంలోకి దిగి ఓ ట్వీట్ పెట్టారు. ''నేటి విషపూరిత సోషల్ మీడియా ప్రపంచంలో కొందరు స్టార్స్ .. అభిమానుల గ్రూప్స్ నిర్వహించడానికి, వారిని ఆయుధాలుగా మార్చడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఏదీ దానంతట అదే జరిగే అవకాశం లేదు. చివరికి తమ అభిమానులు తమనే కాటేస్తారని స్టార్స్ అర్ధం చేసుకోవాలి. ఇకనైనా ప్రేమని, ద్వేషాన్ని కొనుక్కోవడం మానేయండి'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో సిద్దార్థ్ చేసిన ఈ ట్వీట్ చూసి నెటిజన్లు పెద్దఎత్తున రియాక్ట్ అవుతున్నారు. ఆయన పెట్టిన ఈ పోస్ట్ సమంతను ఉద్దేశించే అనే కోణంలో కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా ట్రోల్స్ గురించి సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పిన దానికి కౌంటర్‌గా సిద్దార్థ్ ఇలా రియాక్ట్ అయ్యారని అంటున్నారు. ఏదేమైనా సమంత డివోర్స్ తర్వాత ఆమె మాజీ ప్రియుడిగా జనం భావించే సిద్దార్థ్ మరోసారి ఇలా వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.


By December 09, 2021 at 08:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/samantha-reaction-on-trolls-hero-siddharth-latest-post-viral/articleshow/88177132.cms

No comments