Breaking News

సింహంలా ఉన్నావంటూ నానితో కొడుకు అల్ల‌రి... వీడియో వైర‌ల్‌


నేచుర‌ల్ స్టార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ‌రాయ్‌’. ఈ సినిమా క్రిస్మ‌స్ సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 24న విడుల‌కు స‌న్న‌ద్ధ‌మవుతుంది. ఎంటైర్ యూనిట్ సినిమాను ప్ర‌మోట్ చేయ‌డంలో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా హీరో నాని ఓ వీడియోను షేర్ చేశారు. అందులో త‌న కొడుకు జున్నుతో ఆడుకుంటున్నారు హీరో నాని. శ్యామ్ సింగ‌రాయ్ షూటింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఆ వీడియో చిత్రీక‌రించిన‌ట్లు ఉంది. అందులో నాని మెలితిప్పిన మీసాల్ని కొడుకు జున్ను పైకి తిప్పుతున్నాడు. ఆ స‌మ‌యంలో నాని కొడుకును ఉద్దేశించి నా పేరేంటో తెలుసా? అన్నారు. దానికి శ్యామ్ సింగ‌రాయ్ అని స‌మాధానం ఇచ్చాడు జ‌న్ను. త‌ర్వాత నాని త‌న మీసాల‌ను చ‌క్క‌గా స‌రి చేసుకుంటుండ‌గా, జున్ను ఒప్పుకోలేదు. మీసాలు పైకి ఉంటే సింహంలా ఉన్నావ్ డాడి అంటున్నాడు. దానికి నాని అవునా అని రిప్లై ఇచ్చారు. ఇక నాని శ్యామ్ సింగ‌రాయ్ విష‌యానికి వ‌స్తే.. ఇది కోల్ క‌త్తా బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ సినిమా. దేవ దాసీ వ్య‌వ‌స్థ‌పై పోరాటం చేసే శ్యామ్ సింగ‌రాయ్‌గా నాని క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను అమాంతం పెంచాయి. ఇందులో నాని రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌లో క‌నిపించ‌నున్నారు. సినిమాలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డొన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై వెంక‌ట బోయ‌న‌ప‌ల్లి ‘’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాక్సీవాలా ఫేమ్ రాహుల్ సంక్రిత్యాన్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. నాని కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. సినిమాతో డెఫ‌నెట్‌గా హిట్ కొడ‌తాన‌నే న‌మ్మ‌కంతో నాని ఉన్నారు. శ్యామ్ సింగ‌రాయ్ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ విడుద‌ల చేస్తున్నారు. మ‌రో వైపు నాని త‌న త‌దుప‌రి చిత్రం ‘అంటే సుంద‌రానికీ’ వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అలాగే దసరా అనే మరో సినిమాను కూడా నాని లైన్‌లో పెట్టుకుని రెడీగా ఉన్నారు.


By December 20, 2021 at 03:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-nani-latest-video-with-his-son-goes-viral/articleshow/88389676.cms

No comments