Breaking News

దేవుడిచ్చిన వరమిది.. వేదికపై కంటతడి పెట్టుకున్న సాయి పల్లవి! హత్తుకున్న నాని


రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ , సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ''. భారీ అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీన రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషనల్‌లో భాగంగా హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌లో అనురాగ్ కులకర్ణి పాడిన పాటతో సాయిపల్లవి ఎమోషనల్ అయింది. వేదికపై తన ఫీలింగ్స్ బయటపెడుతూ కంటతడి పెట్టుకుంది. సాయిపల్లవి స్టేజ్ మీదకు రాగానే ఈలలు, గోలలతో ప్రీ రిలీజ్ ప్రాంగణం హోరెత్తిపోయింది. ఈ పరిస్థితుల నడుమ తీవ్ర భావోద్వేగంతో సాయిపల్లవి తన మనసులో మాట చెప్పింది. కళ అనేది దేవుడు ఇచ్చిన వరమని, సరస్వతి దేవి అందరికీ ఆ కళ ఇస్తుంది. కానీ హర్డ్ వర్క్ చేసి కొంతమంది తమ రంగంలో స్థిరపడుతారని చెప్పుకొచ్చింది. ఆ కోవలో తాను ఉండి ఇంత ఆదరణ పొందుతున్నందుకు చాలా హ్యాపీగా ఉందని తెలిపింది. ''ప్రస్తుతం యాంకర్ సుమ ఉందనుకోండి. ఆమె స్టేజ్ ఎక్కే వరకు ఆమె మైండ్‌లో, ఇంట్లో ఎన్నో సమస్యలు ఉన్నా అవన్నీ మర్చిపోయి స్టేజ్ మీద ఫైర్ క్రాకర్‌గా చెలరేగిపోతుంది. అలాగే యాక్టర్స్ కూడా సెట్స్‌పైకి వచ్చిన తర్వాత వారి బాహ్య ప్రపంచాన్ని మరిచిపోతారు. పాత్రలోనే లీనమైపోయి తమ బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో నన్ను ఓ గొప్ప స్థానంలో నిలబెట్టింది. నటిగా నన్ను చాలా ఆదరిస్తున్నారు. మొదటి సినిమా తర్వాత ఈ అమ్మాయి బాగా చేయలేదనే నమ్మకంతో అవకాశాలు ఇచ్చిన డైరెక్టర్లకు, నన్ను దృష్టిలో పెట్టుకొని రోల్స్ రాసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేషనల్ అవార్డు, ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు స్టేజ్‌పై ఏడుస్తానని అనుకొన్నాను. కానీ ఈ రోజు ఓ పాట నన్ను కదిలించడంతో భావోద్వేగంతో ఏడ్చాను. యాక్టర్‌గా ఈ ఆర్ట్ ఫామ్‌లో ఉండటమే నాకు గొప్ప అవార్డు. స్టేజ్ మీద ఉంటే.. ఫైర్, బేబమ్మ, భానుమతి, ఫిదా అంటూ ప్రేక్షకులు అరుస్తున్నారు. ఇలాంటి ప్రశంసలు అందుకోవడం చాలా ఎమోషనల్‌గా ఉంది. ఇలాంటి గొప్ప జీవితాన్ని ఇచ్చినందుకు దేవుడికి, నా తల్లి దండ్రులకు థ్యాంక్స్ చెబుతున్నా'' అని అన్నారు. ఇకపోతే 'శ్యామ్ సింగరాయ్' సినిమా కోసం టీమ్ అంతా ఎంతో కష్టపడి బెస్ట్ అవుట్‌పుట్ తీసుకొచ్చారని చెప్పిన సాయి పల్లవి.. చిత్ర యూనిట్ మొత్తానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. సాయి పల్లవి ఇచ్చిన ఈ ఎమోషనల్ స్పీచ్ అనంతరం ఆమెను ప్రేమగా హత్తుకున్నారు నాని.


By December 19, 2021 at 10:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-pallavi-emotional-speech-at-nani-shyam-singha-roy-pre-release-event/articleshow/88368764.cms

No comments