Breaking News

ట్రాప్ చేసి నన్ను సెక్స్ రాకెట్‌లో ఇరికించారు.. అంత చిన్న బాబుని పెట్టుకుని అలాంటి పనులు చేస్తానా?


హైదరాబాద్ బేగంపేట్‌లోని కుందన్ బాగ్ సెక్స్ రాకెట్ వ్యవహారం అప్పట్లే టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఓ వైపు టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇండస్ట్రీ షేక్ అవుతున్న తరుణంలో ఈ సెక్స్ రాకెట్ ఇష్యూని తెరపైకి చెచ్చారు. కుందన్ బాగ్ లో అపార్ట్ మెంట్‌లో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఇద్దరు హీరోయిన్లు, ఉజ్బెకిస్థాన్ యువతితో పాటు.. వ్యభిచార గృహం నిర్వహిస్తున్న నిర్మాత జువ్వలరాజుతో పాటు.. మరికొంతమందిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే ఓ సినిమా స్టోరీ చెప్పడానికి పిలిపించి.. ఈ కేసులో ఇరికించారని హీరోయిన్ సైరా భాను చెప్పగా.. మరోనటి జ్యోతి కూడా ట్రాప్ చేసి ఇరికించారని వాపోయింది. తాను ఏ తప్పూ చేయలేదని.. కావాలని డ్రగ్స్ కేసుని డైవర్ట్ చేయడానికే ఆరోజు పక్కా ప్లాన్ ప్రకారం తనని ఈ కేసులో ఇరికించారంటూ నాటి విషయాలను పంచుకున్నది . టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో నాలాంటి వాళ్లకి రెగ్యులర్‌గా వచ్చే మెసేజ్‌లు ఆగిపోయాయి.. ఎందుకొచ్చిన గోలలే.. ఏం బయటపెడుతుందో.. ఏ డిబేట్‌లో కూర్చుంటుందో అని మెసేజ్‌లు పెట్టడం మానేశారు. వందమంది వందరకాలుగా మాట్లాడతారు.. ఆ మాటలకు చేతలకు మనం రియాక్ట్ అయ్యే విధానాన్ని బట్టే అవతల వాళ్ల రియాక్షన్ ఉంటుంది.. నువ్ ఎలా స్పందిస్తున్నావ్ అన్నదే ముఖ్యం. ఫిల్మ్ లైన్‌లో ఉన్నామంటే.. రకరకాలుగా మాట్లాడతారు. అది వాళ్ల స్టాండర్డ్.. ఎలా రియాక్ట్ అయ్యాం అన్నది నా స్ట్రాండర్డ్. నా మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి.. అవన్నీ బుల్ షిట్. నాకు తెలుసు నేనేంటో.. నువ్ ఎవరు నన్ను ప్రశ్నించడానికి.. ఫేక్ లైఫ్ అనేదానికి దూరంగా ఉంటాను. నా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. డైవోర్స్ తీసుకుని బాబుని నేనే చూసుకుంటున్నా. ఇప్పటివరకూ సింగిల్ పెన్‌ కూడా ఆయన బాబుకి కొని ఇవ్వలేదు. డైవోర్స్ కేసు నడుస్తోంది. ఆయన యుఎస్‌లో ఉంటాడు.. వేరే పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. నేనే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. లైఫ్‌లో ఓసారి దెబ్బతిన్న తరువాత మళ్లీ అలాంటి డేరింగ్ స్టెప్ తీసుకోలేకపోతున్నా.. వచ్చిన వాళ్లు ఎలా ఉంటారో.. బాబుని సరిగా చూసుకోగలరా? లేరా? అని ఆలోచించా.. నాకు వచ్చే అవకాశాలు వస్తున్నాయి. వాటిని చేసుకుంటూ వెళ్తున్నా. సెక్స్ రాకెట్ ఇష్యూపై.. అదొక బ్యాడ్ ఎక్స్ పీరియన్స్.. ప్రత్యేకించి ట్రాప్ చేసి నన్ను ఇరికించారు. ఆ కేసులో వేరే అమ్మాయి ఎవరో ఉన్నారు.. ఆమె పెద్దగా ఫేమస్ కాదు.. నాలాంటి వాళ్లు ఉంటే సంచలనం అవుతుందని హైలైట్ చేసిపారేశారు. ఆ డ్రగ్ కేసుని డైవర్ట్ చేయడానికి ట్రాప్ చేసి నన్ను ఇరికించారు. ఇంట్లో ఉన్న దాన్ని నన్ను తీసుకుని వెళ్లి ట్రాప్ చేయడం అనేది బుల్ షిట్.. కర్మ నుంచి తప్పించుకోలేం. నాకు అన్యాయం చేసిన వాళ్లు కర్మ అనుభవిస్తున్నారు. నన్ను ట్రాప్ చేసిన వాళ్ల తల్లి చనిపోయారు.. భార్య చనిపోయారు.. అప్పుడే నేను డైవోర్స్ తీసుకుని వచ్చాను.. నా భర్త వైపు నుంచి కూడా నా కెరియర్ నాశనం చేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. నన్ను బ్యాడ్ చేయాలని అనుకున్నారు చేశారు. నేను డిప్రెషన్‌లోకి వెళ్లాను.. చేయని తప్పుకి నింద భరించా.. ఆ ఇన్సిడెంట్ జరిగిన వారంలోనే మా నాన్న గారు చనిపోయారు. ఓ ఏడాది పాటు నేను బయటకు రాలేదు.. నరకం చూశాను. మా నాన్న లాయర్.. ఫైట్ చేయమని చెప్పారు.. కానీ ఎవరితో చేయాలి ఎలా చేయాలో తెలియలేదు. నా కొడుకు వయసు అప్పటికి రెండున్నరేళ్లు.. అంత చిన్న బాబుని పెట్టుకుని ఎవరైనా అక్కడకి వెళ్లి అలాంటి పనులు చేస్తారా? ఇది జనాల ఫూలిష్ నెస్ కాకపోతే ఏంటి.. ఆ ఇష్యూతో నాకు అర్థమైంది ఏంటంటే.. పరిస్థితి ఏదైనా నువ్ రియాక్ట్ అయితేనే అది నీకు హర్టింగ్‌గా అనిపిస్తుంది.. నువ్ రియాక్ట్ కాకపోతే ఏదీ అనిపించదు. నేను ఇప్పటికీ చెప్తున్నా.. నన్ను ట్రాప్ చేసి ఆ కేసులో ఇరికించారు. ఒకవేళ నాకు ఇష్టం ఉంటే ఆపని చేస్తా.. ప్రశ్నించడానికి వీళ్లు ఎవరు? ఓ అమ్మాయిని ట్రాప్ చేసి కేసులో ఇరికించినందుకు వాళ్ల కర్మ వాళ్లు అనుభవిస్తున్నారు. నన్ను ఇరికించిన వాడి తల్లి బస్ కింద పడిచనిపోయింది.. వాళ్ల వైఫ్ చనిపోయింది.. ఇది ప్రూఫ్. నా మీద ఇలాంటి చాలా ఆరోపణలు వచ్చినప్పటికీ ఈరోజుకీ నేను వర్క్ చేయగలుగుతున్నాను.. ఇండస్ట్రీలోనే ఉన్నాను. జనాలు తెలివితక్కువవాళ్లేం కాదు.. తప్పు ఎవరు చేశారో వాళ్లకి తెలుసు. నాపై ఆరోపణలు చేసిన వాళ్లకి సాక్ష్యం చూపించమని అడిగాను.. మీడియా కూడా ఆరోజు నన్ను బ్యాడ్‌గా చూపించింది. డ్రగ్స్ కేసుని డైవర్ట్ చేయడానికి నన్ను ఉపయోగించుకుని ట్రాప్ చేశారు. నేను స్పాట్‌లో లేను.. కనీసం నా వెహికల్ కూడా ఆ స్పాట్‌లో లేదు. టాస్క్ ఫోర్స్ వాళ్లు నా ఇంటికి వచ్చి వాళ్ల వెహికల్‌లోనే తీసుకుని వెళ్లి.. తప్పు ఒప్పుకోమని బలవంతం చేశారు.. నన్ను కొట్టడానికి కూడా చూశారు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది నటి జ్యోతి.


By December 07, 2021 at 09:46AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-jyothi-reveals-shocking-facts-about-prostitution-case/articleshow/88136013.cms

No comments