Breaking News

అల్లు అర్జున్ ‘పుష్ప’కు మెగాస్టార్ అభినందనలు.. పుకార్లకు చెక్ పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్‌’ చిత్రంతో రేపు థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బ‌న్నీ పాన్ ఇండియా మూవీగా చేస్తోన్న తొలి ప్ర‌య‌త్నం. సుకుమార్ ద‌ర్శ‌కుడు. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తం శెట్టి మీడియా క‌లిసి ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో నిర్మించాయి. ఒక వైపు బ‌న్నీ ప్ర‌మోష‌న్స్ కార్య‌క్ర‌మాల‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న టీమ్‌తో క‌లిసి ముంబై ప్రెస్ మీట్‌లో ఉన్నారు. అఖండ త‌ర్వాత టాలీవుడ్ నుంచి వ‌స్తోన్న మ‌రో భారీ చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బ‌న్నీ అండ్ టీమ్‌లో తెలియ‌ని ఓ టెన్ష‌న్ ర‌న్ అవుతుంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ టెన్ష‌న్‌ను కాస్త కూల్ చేసేలా పుష్ప ది రైజ్ టీమ్‌కు మెగాస్టార్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. ‘‘అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్న‌, డైరెక్ట‌ర్ సుకుమార్, మైత్రీ మూవీ మేక‌ర్స్ అండ్ టీమ్‌కు అభినంద‌న‌లు. మీ రక్తం, స్వేదం, గుండె, ఆత్మ‌ల‌ను పెట్టి పుష్ప సినిమా చేశారు. మీ ప్ర‌య‌త్నాల‌న్నీ విజ‌య‌వంతం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. గుడ్ ల‌క్‌’’ అని ట్వీట్ చేశారు చిరంజీవి. పుక్లార‌కు చెక్ పెట్టిన మైత్రీ మూవీ మేకర్స్‌ పుష్ప సినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల‌తో పాటు బాలీవుడ్‌లోనూ విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా.. ఈ సినిమా హిందీ వెర్ష‌న్ సెన్సార్ చేయ‌డంలో స‌మ‌స్య‌లు వ‌చ్చాయ‌ని, దీంతో అనుకున్న స‌మ‌యంలో పుష్ప హిందీ వెర్ష‌న్ విడుద‌ల కావ‌డం లేదంటూ వార్త‌లు నెట్టింట వార్త‌లు వినిపించాయి. అయితే ఈ వార్త‌ల‌ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఖండించింది. పుష్ప సినిమాను ఐదు భాష‌ల్లో అనుకున్న స‌మ‌యంలో విడుద‌ల చేస్తున్న‌ట్లు నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. దీంతో బాలీవుడ్‌లో పుష్ప విడుద‌ల కానుండ‌టం అనేది ఫిక్స్ అయ్యింది. చిత్తూరు జిల్లా శేషాచ‌ల అడ‌వుల్లో జ‌రిగే ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో పుష్ప సినిమాను రూపొందిస్తున్నారు.ఇందులో బ‌న్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఇది వ‌ర‌కు ఎన్న‌డూ చేయ‌ని ర‌గ్డ్ లుక్‌లో అల్లు అర్జున్.. త‌గ్గేదే లే అని ఆక‌ట్టుకోవ‌డానికి రెడీ అయ్యారు. రెండు భాగాలుగా రూపొంద‌నున్న ఈ సినిమాలో తొలి భాగంగా పుష్ప ది రైజ్.. డిసెంబ‌ర్ 17న రిలీజ్ అవుతుంది. ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించగా.. మ‌లయాళ స్టార్ హీరో ఫ‌హాద్ ఫాజిల్ విల‌న్‌గా న‌టించారు. సునీల్, అన‌సూయ‌, అజ‌య్ త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.


By December 16, 2021 at 11:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mega-star-chiranjeevi-wishes-to-pushpa-team-mythri-movie-makers-clarity-on-pushpa-hindi-version-release/articleshow/88313087.cms

No comments