Breaking News

టికెట్స్ రేట్లు తగ్గించడం కాదు.. రాజమౌళికి రివార్డ్ ఇవ్వాలి: ఆర్జీవీ ఇంట్రస్టింగ్ కామెంట్స్


తెలుగోడి సత్తా ఏంటనేది ప్రూవ్ చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించిన ఘటన సొంతం. తెలుగు కళాకారుల్లో ఎంతో టాలెంట్ ఉందని, భారీ బడ్జెట్ సినిమాలు రూపొందించి భారీ వసూళ్లు రాబట్టవచ్చని 'బాహుబలి' సినిమాతో ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా చేశారు జక్కన్న. ఇదే విషయాన్ని ప్రస్తావనకు తెస్తూ ఆంధ్ర ప్రదేశ్ టికెట్స్ రేట్స్ ఇష్యూపై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు . ఈ మేరకు రాజమౌళిపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ టికెట్స్ రేట్స్ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీలో సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నాని లాంటి సినీ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలు, వాటిపై ఏపీ పొలిటీషియన్స్ వేసిన కౌంటర్స్ తీవ్ర దుమారం రేపాయి. అయితే ఈ ఇష్యూ లోకి ఎంటరైన రామ్ గోపాల్ వర్మ.. ఎప్పటిలాగే లాజిక్స్ మాట్లాడుతూ ఏపీ టికెట్ రేట్స్‌కి దర్శక ధీరుడు రాజమౌళికి లింక్ పెడుతూ మాట్లాడారు. హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ స్పైడర్ మ్యాన్‌కి పెట్టిన ఖర్చులో 100వ వంతుతో రాజమౌళి బాహుబలి సినిమా తీశాడు. ఈ సినిమాతో తన బాహుబలి సినిమా హాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీని మించిన రెస్పాన్స్ తెచ్చుకుందని ప్రూవ్ చేశాడాయన. ప్రొడ్యూసర్‌తో ఖర్చు పెట్టించడంలో ఆ రోజు తెలుగు సినిమాకు ఉన్న కెపాసిటీని రెండు మూడంతలు చేస్తూ ధైర్యం చేశారు. అది ఫ్లాప్ అయితే నిర్మాతకు నష్టపోతాడు, రాజమౌళికి కాస్త బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుంది. కానీ అది సక్సెస్ కావడం వల్ల ఈ రోజు తెలుగు సినిమా గురించి యావత్ ప్రపంచం చెప్పుకుంటోంది. మంచి సినిమా చేస్తే సక్సెస్ అవుతుందని రాజమౌళి ప్రూవ్ చేయడం వల్లే మొన్నటి కేజీఎఫ్, పుష్ప లాంటి సినిమాలకు దారి చూపించినట్లయింది. దీని వల్ల రెవెన్యూ పెరుగుతుంది. ప్రభుత్వానికి టాక్స్ రూపంలో లాభం చేకూరుతుంది. కాబట్టి నా ఉద్దేశంలో అలాంటి టాలెంట్ ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం టాక్స్ బెనిఫిట్ ఇవ్వాలి. టికెట్స్ రేట్స్ తగ్గించడం పక్కనబెట్టి రాజమౌళికి రివార్డ్ ఇవ్వాలి. తెలుగు రాష్ట్రాలకు రాజమౌళి చేసిన సేవను డబ్బుతో కొలవలేం. ఆ ఘనత ఎప్పటీకీ నిలిచిపోతుంది'' అన్నారు రామ్ గోపాల్ వర్మ.


By December 30, 2021 at 09:41AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/ap-ticket-rates-issue-ram-gopal-varma-interesting-comments-on-rajamouli/articleshow/88580703.cms

No comments