Breaking News

ఎన్టీఆర్, రామ్ చరణ్‌లపై రాజమౌళి క్రేజీ కామెంట్స్.. మెగా, నందమూరి అభిమానులతో గోల పెట్టించిన జక్కన్న


దర్శక ధీరుడు రాజమౌళిది ఎల్లలు దాటిన క్రేజ్. బాహుబలి సిరీస్‌తో తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిన జక్కన్న.. మరో ప్యాన్ ఇండియా మూవీ RRRతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కూడా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఆ అంచనాలకు రెట్టింపు చేసేలా చిత్ర ప్రమోషన్స్ చేపడుతున్నారు . ఇందులో భాగంగా గత వారం మొత్తం బాలీవుడ్‌లో ప్రోమోట్ చేసిన టీమ్ నిన్న (సోమవారం) రాత్రి కేరళలో సందడి చేసింది. కేరళలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఏర్పాటు చేసి అక్కడి అభిమానుల్లో జోష్ నింపారు రాజమౌళి. ఈ వేదికపై రాజమౌళి మాట్లాడుతూ.. ''నిర్మాత దానయ్య గారు నాతో ఓ సినిమా చేసేందుకు 13 సంవత్సరాలుగా ఎదురుచూశారు. ఆయనతో బిగ్గెస్ట్ సినిమా చేస్తానని చెప్పి RRR చేశాను. నా కోసం ఇన్ని సంవత్సరాలు ఎదురుచూసినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నా. నేను చేసిన సినిమాల గురించి దేశవ్యాప్తంగా చెప్పుకోవడం చూస్తుంటే చాలా చాలా ఆనందంగా ఉంది. నేను రూపొందించిన ‘ధీర, ఈచ, బాహుబలి’ చిత్రాలకు కేరళ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు RRR సినిమాకు అంతకుమించిన ఆదరణ లభిస్తుందని నమ్ముతున్నా. కేరళతో నాకు మంచి అనుబంధం ఉంది. ‘సింహాద్రి’ సినిమాను ఇక్కడ సుమారు 25 రోజుల పాటు షూట్ చేశాం. కేరళ ప్రజలు చాలా సపోర్ట్ చేశారు. ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేను. తెలుగు సూపర్ పవర్ హౌసెస్, మై బ్రదర్స్, మై ఫ్యామిలీ మెంబర్స్ , రామ్ చరణ్‌లను మీ ముందుకు తీసుకొస్తున్నా. RRR సినిమాకు కూడా మీ లవ్, సపోర్ట్ అందుతుందని నమ్ముతున్నా'' అన్నారు.


By December 30, 2021 at 08:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/rrr-pre-release-event-at-kerala-rajamouli-comments-on-jr-ntr-ram-charan/articleshow/88579883.cms

No comments