విజయ్ దేవరకొండపై బోల్డ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ !
మన రౌడీ హీరో విజయ్ దేవరకొండకు క్రేజ్ రోజు రోజుకీ పెరుగుతోంది. టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజులకే కుర్ర హీరో యూత్‌లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను దక్కించుకున్నాడు. అయితే ట్రెండ్‌ను ఫాలో కావడం.. సోషల్ మీడియాను చక్కగా ఉపయోగించుకోవడం వంటి కారణాలతో బాలీవుడ్‌లోనూ ఓ గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆసక్తికరమైన విషయమేమంటే.. ఇంకా ఈ హీరో ఓ హిందీ సినిమా చేయకపోయినా, ఆ గుర్తింపు రావడం అంటే గొప్ప విషయమే. ఇంతకీ ఈ రౌడీ హీరోకి వచ్చిన గుర్తింపు ఏంటో తెలుసా..ఇప్పుడు హీరోల్లో హాట్ హీరో అని. ఈ మాట మనం చెప్పలేదండోయ్! ఏకంగా బాలీవుడ్‌లో అప్‌కమిగ్ స్టేజ్‌లో ఉన్న స్టార్ హీరోయిన్స్ చెబుతున్నారు. కొన్ని రోజుల ముందు మీకు దక్షిణాదిన నచ్చే హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు బాలీవుడ్ హీరోయిన్, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.. విజయ్ దేవరకొండ అని ఏమాత్రం తడుముకోకుండా సమాధానం చెప్పేసింది. ఇప్పుడు ఈమెను ఆమె ఫ్రెండ్ కూడా ఫాలో అయ్యింది. ఇంతకీ జాన్వీ కపూర్‌ను ఫాలో అయిన ఫ్రెండ్ ఎవరో తెలుసా.. సారా అలీఖాన్. ఈమె కూడా తనకు విజయ్ దేవరకొండ అంటే చాలా ఇష్టమని సిగ్గు ఒలకబోసింది. వివరాల్లోకి వెళితే.. అక్షయ్ కుమార్, ధనుష్‌లతో కలిసి అత్రంగి రే సినిమా చేసింది. ఈ సినిమా ప్రమోషన్స్ జరుగుతున్న సమయంలో మీ ఫేవరేట్ స్టార్ ఎవరు అని అడిగితే విజయ్ దేవరకొండ అని చెప్పేసింది. తను కూల్‌గా కనిపిస్తాడు.. హాట్ హీరో అని కూడా బోల్డ్‌గా చెప్పేసింది. తనతో కలిసి నటించాలనుందని మనసులోని మాటను బయట పెట్టేసింది. ఇంతకు ముందు కూడా ఓసారి విజయ్ దేవరకొండతో దిగిన సెల్ఫీ ఫొటోను షేర్ చేసిన సారా అలీఖాన్.. అప్పట్లో ఫ్యాన్ మూమెంట్ అని చెప్పింది. ఇప్పుడు మరోసారి విజయ్ దేవరకొండపై తన తన అభిప్రాయాన్ని చెప్పింది. విజయ్ దేవరకొండ త్వరలోనే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నారు. . పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో విడుదలవుతుంది. ఇందులో విజయ్ దేవరకొండ బాక్సర్‌గా కనిపించబోతున్నారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. లైగర్‌లో అనన్య పాండే హీరోయిన్.
By December 12, 2021 at 09:24AM
Post Comment
No comments