ప్రధాని మోదీ ట్విటర్ అకౌంట్ హ్యాక్... bitcoinపై తప్పుడు ప్రచారం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా కొద్ది సమయం హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం పేర్కొంది. అయితే కొంతసేపటికే ట్విటర్ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్‌లో బిట్‌కాయిన్‌లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతోందని లింక్‌లు పోస్ట్ చేశారు. దీనిపై పీఎంవో అధికారులు వెంటనే స్పందించి ట్విటర్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ట్వీట్‌ను తొలగించారు. అనంతరం ట్విటర్ అకౌంట్‌ను రీస్టోర్ చేశారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సమయంలో ప్రధాని కార్యాలయం ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్ అయిందని, ఆ ఖాతాలో ఏవైనా ట్వీట్‌లు పోస్టులు చేస్తే స్వల్పకాలం పాటు స్పందించవద్దని పేర్కొంది.
By December 12, 2021 at 08:20AM
No comments