Breaking News

15 కేజీల బంగారం చోరీ.. శ్మశానంలో దాచిపెట్టిన దొంగ


దొంగలు ఎన్ని ప్లాన్లు వేసినా.. పోలీసులు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ.. వారికి చెక్ పెడుతున్నారు. తాజాగా ఓ దొంగ ఎవరికి డౌట్ రాకుండా చోరీ చేసిన సొత్తును శ్మశానవాటికలో దాచిపెట్టాడు. సీసీ ఫుటేజ్ ద్వారా దొంగను గుర్తించిన పోలీసులు.. తమ స్టైల్లో విచారించే సరికి నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని వెల్లూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వెల్లూరులోని ప్రముఖ బంగారు ఆభరణాల దుకాణంలోకి అనైకట్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ముసుగు ధరించి ఇటీవల దొంగతనం చేసేందుకు వెళ్లాడు. పక్కా ప్లాన్‌లో ఏకంగా 15 కేజీల బంగారాన్ని చోరీ చేశాడు. అయితే అంత భారీ బంగారాన్ని ఎవరికి డౌట్ రాకుండా శ్మశానవాటికలో దాచిపెట్టాడు. బంగారం చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ ఫుటేజ్ పరిశీలించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. దొంగ కోసం గాలించారు. చివరకు నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. బంగారం గురించి విచారించారు. అయితే అతడు చెప్పిన సమాధానంతో పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. వెల్లూరు పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒడుకత్తూరు వద్ద ఉన్న శ్మశానవాటికలో అతను చోరీ చేసిన బంగారాన్ని దాచిపెట్టినట్లు చెప్పాడు. అక్కడికి వెళ్లి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.


By December 21, 2021 at 03:46PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/thief-arrested-in-tamilanadu-for-15-kgs-gold-stolen-from-jewellary-shop-at-velluru/articleshow/88410937.cms

No comments