Breaking News

Upasana: సమంత ప్రేమ ఎలాంటిదంటే..! ఆమె నుంచి చాలా నేర్చుకున్నా.. ఉపాసన ఓపెన్ కామెంట్స్


సెలబ్రిటీ కోడళ్ళుగా అటు ఉపాసన, ఇటు ఎంతో ఫేమస్ అయ్యారు. ఎవరికి వారిది ప్రత్యేకమైన దారే అయినా ఇద్దరి మధ్య కొన్ని ఆలోచనలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. మహిళా శక్తి, సమాజ సేవ, ఆరోగ్యం, పర్యావరణ హితం ఎన్నో విషయాల్లో సామ్, ఒకేలా ఆలోచిస్తుంటారు. అలానే వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఏర్పడింది. ఈ నేపథ్యంలో సమంత డివోర్స్ తర్వాత ఆమెపై ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన మెగా కోడలు ఉపాసన.. సమంత గురించి నోరువిప్పింది. ఆమెపై తన అభిప్రాయాన్ని చెబుతూ ఓపెన్ అయింది. అర్హులైన నిపుణుల నుండి నిర్దిష్టమైన సమాచారాన్నిఅందిస్తూ ఆరోగ్యకరమైన జీవనశైలి అవకాశాన్ని కల్పించడం, ప్రజలు తమ జీవితాలను పరిపూర్ణంగా ఆరోగ్యకరంగా సాగించేలా స్ఫూర్తిని అందించడం లక్ష్యంగా URLife.co.in అనే వెబ్‌సైట్‌ ప్రారంభించింది ఉపాసన. ఈ వెబ్‌సైట్‌కు అతిథి సంపాదకురాలిగా సమంత వ్యహరించిన సంగతి మనందరికీ తెలుసు. సమంత సేంద్రీయ వ్యవసాయం ద్వారా పర్యావరణ రక్షణని ప్రోత్సహిస్తున్నారు. పూర్తి శాకాహారపు జీవనాన్ని అనుసరిస్తూ ఫిట్‌నెస్ మెయిన్‌టైన్ చేస్తున్నారంటూ ప్రకృతి అనుకూలమైన జీవనం, సంపూర్ణ ఆరోగ్యం, మానసిక, భావోద్వేగాల సమతుల్యత లాంటి విషయాలను ప్రజలకు చేరువ చేసే బాధ్యతను సమంత చేతిలో పెట్టేసింది ఉపాసన. ఆ సమయంలో ఉపాసన- సమంత మధ్య ఉన్న స్నేహం మరింత బలపడింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో అదే విషయాన్ని చెప్పింది ఉపాసన. ''నేను తెలంగాణా బిడ్డను. సాధారణంగా మాసం తింటుంటా. దసరా లాంటి వేడుకల్లో కూడా మాసం భుజిస్తుంటాం. కానీ సమంత ఆర్టికల్స్ ఎడిట్ చేశాక చాలా వరకు మాంసం తినడం తగ్గించా. సమంతలో సాయం చేసే గుణం ఉంటుంది. ఎన్నో విషయాల్లో నాకు హెల్ప్ చేస్తుండేది. సమంతది నిజమైన ప్రేమ'' అని చెప్పింది ఉపాసన. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇకపోతే రీసెంట్‌గా నాగ చైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత కూడా ఉపాసనతో కలిసి దీపావళి వేడుకను ఎంజాయ్ చేసిన సమంత. ఆనందాన్ని మించిన ధనం లేదని, మనశ్శాంతిని మించిన విజయం లేదని, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదని అలాగే దయా గుణాన్ని మించిన చల్లదనం లేదని ఈ సందర్భంగా సామ్ పేర్కొంది.


By November 12, 2021 at 08:26AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/upasana-konidela-open-comments-on-star-heroine-samantha/articleshow/87658121.cms

No comments