RT70 : మాస్ మహరాజాలో రాక్షసత్వం.. ‘రావణాసుర’గా రవితేజ
మాస్ మహరాజా రవితేజ తన 70వ సినిమాకు సంబంధించిన టైటిల్ ‘రావణాసుర’ అని అనౌన్స్ చేశారు. హీరోస్ డోంట్ ఎగ్జిట్(హీరోలు మనల్ని విడిచి పెట్టి వెళ్లిపోరు). టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను గమనిస్తే... టైటిల్‌కు తగ్గట్టే రావణాసురుడిలా పదితలలతో రవితేజ ఓ రక్తం ఓడుతున్న సింహాసనంపై ఠీవిగా కూర్చుని ఉన్నారు. ఇలా రవితేజ ఓ సినిమా పూర్తి అయ్యి అవగానే మరో సినిమాను అనౌన్స్ చేస్తున్నారు. తన 70వ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే, 71వ సినిమాగా ‘టైగర్ నాగేశ్వరరావు’లో నటించబోతున్నట్లు తెలిపారు. అదీ కాకుండా.. రీసెంట్‌గా విడుదల చేసిన మరో పోస్టర్లో ఆలయంపై ఉండే శిల్పాలు.. అందులో మన ఇతిహాసం రామాయణంను సూచిస్తున్నాయి. అందులో రావణాసురుడు శిల్పం కనిపిస్తుంది. దానికి తగ్గట్టే టైటిల్ కూడా పెట్టారు. సినిమాలు పూర్తి చేస్తూ కొత్త సినిమాలు అనౌన్స్ చేస్తున్న తీరు చూసి కుర్ర హీరోలు సైతం షాకవుతున్నారు. ఈ ఏడాది క్రాక్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన రవితేజ, మరోవైపు ‘ఖిలాడి’ సినిమాను పూర్తి చేసి కమర్షియల్ స్టార్ హీరో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ‘ధమాకా’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు సుధీర్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీకాంత్ విస్సా అందిస్తున్న కథ, మాటలు అందిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూవీ టైటిల్ పోస్టర్ చూస్తుంటే రవితేజను మరో కోణంలో దర్శకుడు సుధీర్ వర్మ ఆవిష్కరించబోతున్నారని అర్థమవుతుంది. ఫ్యాన్స్ సందడి చేసుకుంటున్నారు. ఆసక్తికరమైన విషయమేంటే ఈ సినిమాతో రవితేజ నిర్మాతగా మారుతున్నారు. సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ఆర్‌టి టీమ్ వర్క్స్ అనే పేరుంది. అంటే ఇది రవితేజ టీమ్ వర్క్స్ అనే నెటిజన్స్ భావిస్తున్నారు. మరి రవితేజ తన సినిమాలకు మాత్రమే నిర్మాతగా ఉంటారా? లేక వేరే టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తాడా? అనేది చూడాలి. సాధారణంగా ఎక్స్‌పెరిమెంటల్ సినిమాలంటే కమర్షియల్ సినిమాలకు రవితేజ ప్రాధాన్యం ఇస్తుంటాడు. అందుకు కారణం ఆయనకు ఎక్స్‌పెరిమెంట్స్ మూవీస్ పెద్దగా కలిసి రాలేదు. మరి సుధీర్ వర్మ ఈసారి రవితేజను డిఫరెంట్‌గా ఎలా ప్రెజెంట్ చేసి మెప్పిస్తారో వేచి చూద్దాం మరి.
By November 05, 2021 at 10:58AM
No comments