Breaking News

RRR ప్రమోషనల్ ప్లాన్ ఎప్పటి నుంచో తెలుసా?


తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌... మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ డ్రామా ‘RRR ’. నాలుగు వంద‌ల కోట్లకు పైగా బ‌డ్జెట్‌తో డివివి దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల‌వుతున్న చిత్రం కావ‌డంతో సినిమాపై అంద‌రూ భారీ అంచ‌నాల‌తో ఎదురుచూస్తున్నారు. ప్ర‌మోష‌న‌ల్ ప్లాన్ కూడా అలాగే బారీ రేంజ్‌లో ఉండ‌బోతుంద‌ని సినీ వ‌ర్గాల స‌మాచారం. డిసెంబ‌ర్ 4 నుంచి ప్ర‌మోష‌న్స్‌ను ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్ అండ్ టీమ్ షురూ చేయ‌బోతున్నారట‌. ఇండియాలోనే ప్ర‌ధాన న‌గ‌రాల‌న్నింటికీ టీమ్ స‌భ్యులు వెళ్ల‌బోతున్నారు. దీని కోసం ఓ చార్టెడ్ ఫ్లైట్‌ను అద్దెకు తీసుకోబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న సినిమా కావ‌డంతో బాలీవుడ్ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూస్తుండ‌గా.. టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ మూవీ కావ‌డంతో ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు నందమూరి ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ప‌రిశ్ర‌మ అంతా ఎదురుచూస్తుంది. అగ్ర న‌టీన‌టులు చేసిన సినిమా కావ‌డంతో సినిమా క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలాంటి సంచ‌నాల‌కు తెర తీస్తుందోనిన ట్రేడ్ వ‌ర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు మూడు గంట‌ల‌కు పైగా ఉన్న ఫుటేజ్‌ను 2 గంట‌ల 45 నిమిషాల‌కు కుదించార‌ట రాజ‌మౌళి. దీనిపై మ‌రింత క‌స‌ర‌త్తు చేస్తున్నారట జ‌క్క‌న్న డిసెంబ‌ర్ 4 లోపు ఈ వ్య‌వ‌హారాల‌ను కుదించాల‌ని టీమ్‌ను ప‌రుగులు తీయిస్తున్నార‌ట‌. ప్రీ ఇండిపెండెన్స్ 1940 బ్యాక్‌డ్రాప్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో అల్లూరిగా రామ్‌చ‌ర‌ణ్‌, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ పాత్ర‌లు బ్రిటీష్‌వారిని వీరిద్ద‌రూ ఎలా ఎదిరించార‌నేదే క‌థాంశం. అస‌లు వీరిద్ద‌రూ చ‌రిత్ర‌లో ఎప్పుడూ క‌లుసుకోలేదు. కానీ ఒక‌వేళ క‌లుసుకుని, వారి ఆలోచ‌న‌ల‌ను ప‌ర‌స్ప‌రం చ‌ర్చించుకుని పోరాటం చేస్తే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ పాయింట్‌ను బేస్ చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కించారు. బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్‌తో పాటు స‌ముద్ర‌ఖ‌ని, శ్రియా శ‌ర‌న్‌తో పాటు హాలీవుడ్ స్టార్స్ ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడీ ఈ సినిమాలో ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన క్యారెక్ట‌ర్స్ ప్రోమోలు, లిరిక‌ల్ వీడియో సాంగ్స్‌, గ్లింప్స్ అన్నీ సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి.


By November 22, 2021 at 07:17AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/promotional-plan-for-rrr/articleshow/87839157.cms

No comments